India vs Pakistan: కిక్కిచ్చే ఫైట్‌ ! పిచ్ రిపోర్ట్ ఏంటి.. వర్షం ముప్పు పొంచి ఉందా?

 


India vs Pakistan: పిచ్ రిపోర్ట్ ఏంటి.. వర్షం ముప్పు పొంచి ఉందా?


నేడే భారత్‌ X పాక్‌ మ్యాచ్‌ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానేవచ్చింది. టీ20 వరల్డ్‌క్‌పలో అసలైన కిక్కిచ్చే ఫైట్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు జరిగినా బోసిపోయి కనిపించిన నసౌ స్టేడియం ఇక ఇరు జట్ల ఫ్యాన్స్‌తో కిటకిటలాడనుంది. రీసేల్‌ మార్కెట్‌లో ఒక్క టిక్కెట్‌ ధరే కోటీ 50 లక్షలు పలుకుతుందంటేనే ఈ పోరుకున్న డిమాండ్‌ ఏంటో అర్థమవుతోంది. ఇదంతా..

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ గురించే. ఈ మెగా టోర్నీ ముఖాముఖి పోరులో 6-1 ఆధిక్యంతో తిరుగులేని రికార్డున్న టీమిండియాను.. పసికూన యూఎస్‌ చేతిలో ఓడిన పాక్‌ ఏమేరకు ఎదుర్కోగలదో చూడాల్సిందే!


న్యూయార్క్‌: టీ20 ప్రపంచక్‌పలో అత్యంత ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రెండేళ్ల తర్వాత తొలిసారిగా టీమిండియా ఆదివారం పాకిస్థాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయంతో రోహిత్‌ సేన ఆత్మవిశ్వాసంతో ఉండగా.. పాకిస్థాన్‌ పసికూన యూఎ్‌సఏ చేతిలో ఓడి డీలా పడింది. దీంతో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్‌ బృందానికి భారత్‌పై గెలుపు చాలా కీలకం. ఇక ఇక్కడి డ్రాప్‌ ఇన్‌ పిచ్‌పై అనూ హ్య బౌన్స్‌ బ్యాటర్లను బెంబేలెత్తిస్తోంది. చివరిసారి ఇరుజట్లు 2022 టీ20 వరల్డ్‌క్‌పలో తలపడగా ఆఖరి బంతికి భారత్‌ గెలిచింది. ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు అధ్యక్షస్థాయి భద్రతను ఏర్పాటు చేశారు.

మెరుగైన రికార్డుతో..: కొత్త బంతిని ఎదుర్కొనేందుకు ఈసారి కూడా ఓపెనర్లుగా రోహిత్‌, విరాట్‌ రానున్నారు. ఐర్లాండ్‌తో కోహ్లీ అనవసర షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. కానీ పాక్‌పై మెరుగైన రికార్డున్న విరాట్‌పై ఈసారీ భారీగా అంచనాలు న్నాయి. బంతి పాతగా మారే వరకు ఓపిగ్గా ఎదురుచూస్తేనే ఈ పిచ్‌పై పరుగులు వస్తాయి. వన్‌డౌన్‌లో పంత్‌ ఫామ్‌ జట్టుకు సానుకూలాంశం. పాక్‌ స్పిన్నర్లపై ఎదురుదాడికి శివమ్‌ దూబే సిద్ధంగా ఉన్నాడు. ఐర్లాండ్‌తో ఆడిన మాదిరే భారత్‌ నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది.


తీవ్ర ఒత్తిడిలో..: ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై ఓడడాన్ని అలవాటుగా మార్చుకున్న పాక్‌.. ఈ మ్యాచ్‌ను మరింత ఒత్తిడి మధ్య ఆడనుంది. పాక్‌కు బౌలింగే ప్రధాన బలంగా ఉన్నప్పటికీ యూఎస్‌ బ్యాటర్లు వీరిని దీటుగా ఎదుర్కొని సూపర్‌ ఓవర్‌లో గెలిచారు. ఈ ఓటమితో ఆగ్రహంగా ఉన్న అభిమానులను తిరిగి సంతోషంలో ముంచెత్తాలంటే భారత్‌పై విజయం పాక్‌కు అవసరం. పేసర్లు షహీన్‌, నసీమ్‌, ఆమిర్‌, రౌఫ్‌ తమ పేస్‌ పదునుతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనుకుంటు న్నారు. బ్యాటింగ్‌లో రిజ్వాన్‌, ఉస్మాన్‌ విఫలమవుతున్నారు. బాబర్‌ వేగంగా ఆడాల్సి ఉంది. స్పిన్నర్‌ షాదాబ్‌ స్థానంలో సయీమ్‌ అయూబ్‌ను తీసుకునే చాన్సుంది.

క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) అసలు సిసలైన సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్‌ మరికొన్ని గంటల్లోనే జరగబోతోంది. నసావు కౌంటీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకూ ఎంతో కీలకమైంది. ఓవైపు ఐర్లాండ్‌ని ఓడించి జోష్‌లో ఉన్న భారత్.. పాక్‌పై కూడా ఆధిపత్యం చెలాయించి సూపర్-8కు చేరువ కావాలని చూస్తోంది. మరోవైపు యూఎస్ఏ చేతిలో ఓడిపోయి అవమానంపాలైన పాకిస్తాన్.. ఈ మ్యాచ్‌తో బోణీ కొట్టాలని చూస్తోంది.


పిచ్ రిపోర్ట్

అయితే.. ఈ మ్యాచ్ కంటే ఎక్కువగా పిచ్ గురించి చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం.. నసావు కౌంటీ స్టేడియంలోని డ్రాప్‌ఇన్ పిచ్‌లు బ్యాటింగ్‌కి ప్రమాదకరంగా మారడమే! ఈ పిచ్‌లో బంతులు స్వింగ్, బౌన్స్ అవుతుండటంతో.. బ్యాటర్లు బంతిని అంచనా వేయలేక ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే గాయాలపాలయ్యారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తన భుజానికి బంతి తాకడంతో.. రోహిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అటు.. శ్రీలంక-సౌతాఫ్రికా, భారత్‌-ఐర్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. దీంతో.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎలా సాగుతుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.


ముఖ్యంగా.. ఈ పిచ్ పేసర్లకు అనుకూలమైనది. దీంతో.. పాక్ పేస్ దళంలోని షహీన్‌ షా అఫ్రిది, నసీం షా, హారిస్‌ రవూఫ్, మహమ్మద్‌ అమీర్‌ రెచ్చిపోయేందుకు సన్నద్ధమవుతున్నారు. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే.. వారిని తిప్పి కొట్టే అత్యుత్తమ లైనప్ భారత్‌కు ఉంది. రోహిత్, కోహ్లి, పంత్, సూర్యకుమార్, దూబె, హార్దిక్‌ వంటి వాళ్లు గట్టిగా సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అటు.. మన పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్, హార్దిక్‌‌లతో పాటు స్పిన్నర్లు సైతం మంచి జోరుమీదే ఉన్నారు. మరి.. హోరాహోరీగా సాగే ఈ పోరులో ఎవరు నెగ్గుతారో చూడాలి.


వరుణుడి ముప్పు

దీనికితోడు.. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు వరుణుడి ముప్పు కూడా పొచ్చి ఉంది. మ్యాచ్‌ ప్రారంభమైన అరగంట తర్వాత భారీ వర్షం పడేందుకు 51 శాతం అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. ఈ మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉంది. అయితే.. అమెరికా కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అక్కడ ఉదయం జరుగుతుంది కావడంతో, వర్షం పడినా రద్దు చేయకుండా ఆట కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ.. 20 ఓవర్ల మ్యాచ్ చూస్తామా? లేదా? అనేది మాత్రం మిలిడియన్ డాలర్ ప్రశ్నగా మారింది.


తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, పంత్‌, సూర్యకుమార్‌, శివమ్‌ దూబే, హార్దిక్‌, జడేజా, అక్షర్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, సిరాజ్‌.

పాకిస్థాన్‌: రిజ్వాన్‌, ఉస్మాన్‌, బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), ఫఖర్‌, ఆజమ్‌ ఖాన్‌, ఇఫ్తికార్‌, షాదాబ్‌/సయీమ్‌, షహీన్‌, నసీమ్‌ షా, ఆమిర్‌, రౌఫ్‌.

పిచ్‌, వాతావరణం

నేటి ఉదయం 10 గంటలకు వర్షం కురిసే అవకాశం ఉంది. టాస్‌ ఆలస్యం కావచ్చు. ఇక నసౌ స్టేడియం పిచ్‌ను అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. ఇప్పటి దాకా జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండుసార్లు మాత్రమే 100+ స్కోరు దాటింది. అందుకే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే ఈ ట్రాక్‌పై భారీ స్కోర్లను ఆశించలేం. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow