🔥 Telangana Breaking News | అకాల వర్షాలతో రైతన్నకు భారీ దెబ్బ Telangana Rains Shock Farmers | జగిత్యాలలో తడిసిన ధాన్యం.. రోడ్డెక్కిన రైతులు 🚜


 🌧️ అకాల వర్షం.. రైతన్నకు కడగండ్లే! తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం తడిసిపోవడంతో ఆందోళనలు 🚜😢

తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా జగిత్యాల, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షం, ఈదురు గాలులతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

📍 జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్‌లో
మొక్కజొన్న, వరి ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. సమయానికి తూకం వేయకపోవడంతో పంట నష్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
“ప్లాస్టిక్ కవర్లు ఇవ్వడం లేదు… సంచులు కూడా లేవు” అంటూ అధికారులపై రైతులు మండిపడ్డారు.

📍 నిర్మల్ జిల్లా దస్తురాబాద్, కడెం, జన్నారం మండలాల్లో
ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పంటకల్లాలపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.

📍 కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో
అకాల వర్షంతో రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జగిత్యాల మార్కెట్ యార్డ్‌లో తడిసిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని వెంటనే కొనాలని రైతులు డిమాండ్ చేస్తూ జగిత్యాల-నిజామాబాద్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.

⚠️ నిర్మల్ జిల్లా అంబర్పేట్‌లో ప్రమాదం
వర్షంలో తడుస్తున్న ధాన్యానికి కవర్లు కప్పేందుకు వెళ్తున్న రైతు బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం కనిపించకపోవడంతో ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

🔥 రైతుల డిమాండ్లు:
✅ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి
✅ మార్కెట్ యార్డుల్లో కవర్లు, సంచులు అందించాలి
✅ తూకం ప్రక్రియ వేగవంతం చేయాలి
✅ నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow