మత్తు పదార్థాలతో జీవితం అంధకారం గణేష్ యూత్ సేన అధ్యక్షులు నరేందర్



జడ్చర్ల: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని దక్కించుకుంటారని లేకపోతే జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడతాయని జడ్చర్ల గణేష్ యూత్ సేన అధ్యక్షులు గోనెల నరేందర్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నరేందర్ మీడియాతో మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని, మాదకద్రవ్యాలకు బానిసలు కావడం వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంతో పాటు ఆర్థికంగా కుటుంబం కూడా అతలాకుతలం అవుతుందన్నారు. ఒకసారి అలవాటై అదే వ్యసనంగా మారి బానిసలు అవుతారని బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. 


Previous Post Next Post

نموذج الاتصال