24గంటలు దుకాణాలు బంద్.. కారణం ఏంటంటే..
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో (ఎయిర్‌పోర్ట్ డ్యూటీ ఫ్రీ షాపులు మినహాయించి) ఈనెల 4 ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో (ఎయిర్‌పోర్ట్ డ్యూటీ ఫ్రీ షాపులు మినహాయించి) ఈనెల 4 ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించారు.
నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపిన సీపీ, కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈనెల 4 ఉదయం 6 గంటల నుంచి 5 ఉదయం 6 గంటల వరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం, సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించారు