
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ప్రయాణించే హెలికాప్టర్ మే19న క్రాష్ అయి ఆయనతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, కొంతమంది అధికారులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇరాన్ లోని తూర్పు అజర్ బైజాల్ ప్రాంతో చాపర్ యాక్సిడెంట్ కు గురైంది. అయితే ఈ ఘటనపై ఇరాన్ శ్రతు దేశమైన ఇజ్రాయిల్ స్పందించింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇజ్రాయిల్ ప్రమేయం ఏం లేదని ఓ అధికారి మీడియాతో చెప్పాడు.
గతకొద్దికాలంగా ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఎయిర్ స్టైయిక్స్ కూడా జరుపుకున్నాయి. దీంతో ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కూడా ఇజ్రాయిల్ ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈక్రమంలోనే ఓ ఇజ్రాయిల్ అధికారి ఆ యాక్సిడెంట్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని మీడియాకు వివరణ ఇచ్చారు.
from V6 Velugu https://ift.tt/GtVfZbM
via IFTTT