అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్లో కేసీఆర్ మాట్లాడుతుండు : సీఎం రేవంత్ రెడ్ది

Caption of Image.

పదేళ్ల తరువాత కేసీఆర్ కు రైతులు గుర్తుకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్ది విమర్శించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  కేసీఆర్ పరిస్థితి చూసి సానుభూతి తేలియజేస్తున్నామని చెప్పారు.  కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేసీఆర్ అంటున్నారని ..  వర్షాలు ఎప్పుడు పడ్డాయో చెప్పాలన్నారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు కరువు ఎప్పుడు వస్తు్ందో తెలియదా అని సీఎం  ప్రశ్నించారు.   

కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా వందశాతం పనిచేయాలని. ఆయన చేసిన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.  200 మంది రైతులు చనిపోయారని కేసీఆర్ అంటున్నారని..  నిజంగా చనిపోతే వివరాలు ఇస్తే నష్టపరిహర ఇచ్చి రైతులను అదుకుంటామని రేవంత్ ప్రకటించారు.  పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి  గురైందని ఆరోపించారు.  

కాంగ్రెస్ కు తెలంగాణ ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  తుక్కుగూడ జన జాతర సభకు ఖర్గే, రాహుల్, ప్రియాంక, ముఖ్య నేతలంతా వస్తున్నారని చెప్పారు.  ఈ సభలో జాతీయ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని తెలిపారు.  అదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని సీఎం కోరారు.  గతంలో ఆరు గ్యారంటీలను తుక్కగూడ సభలోనే ఇచ్చామని.. అందులో  5 గ్యారెంటీలను అమలు చేశామన్నారు.   తెలంగాణ నుంచి నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు రేవంత్ .  

ALSO READ :-ఉగాది రోజున ఏ దేవుడిని పూజించాలో తెలుసా..


 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/BISDA2E
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال