KTR: కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు..: కేటీఆర్

 

KTR: హీరోయిన్లను బెదిరించానంటున్నారు.. ఎవరినీ వదిలిపెట్టం.. తాట తీస్తాం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.) హయాంలో తాగునీటి కష్టాలు లేవని.. కేసీఆర్ (KCR) అంటే నీళ్లు.. కాంగ్రెస్ (Congress) అంటే కన్నీళ్లు అని.. సాగునీరు లేక పల్లెలు, తాగు నీరు లేక పట్టణాలు తల్లడిల్లుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex. Minster KTR) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన హైదరాబాద్‌నలో మీడియాతో మాట్లాడుతూ.. గొంతెండి ప్రజలు గొడవ చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాత్రం గొంతు చించుకుని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ జనగామ, నల్గొండ వెళ్లగానే గాయత్రి, నంది పంపు హౌజ్ ఎలా ప్రారంభం అయింది?.. ఇన్నాళ్లు ఆ నీటిని ఎందుకు దాచి పెట్టారు?.. పంటలు ఎండే పరిస్థితి ఎందుకు తెచ్చారు?.. కొట్టుకుపోయిందన్న కాళేశ్వరం నుంచి జల పరవళ్ళు ఎలా తొక్కాయి?.. ఇది కాలంతో వచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు.




అసెంబ్లీ ఎన్నికల సీజన్‌ను మించిన రాజకీయ యుద్ధం తెలంగాణలో ఇప్పుడు నడుస్తోంది. ఒకవైపు ఫోన్‌ ట్యాపింగ్‌, మరోవైపు గేట్లు ఎత్తేస్తున్నామంటూ ఆపరేషన్‌ ఆకర్ష్‌, ఇవిగాకుండా కరువు పరిస్థితులు.. ఇవన్నీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ మూడు అంశాలపై కొన్నిరోజులుగా సాగుతున్న ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ రచ్చను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి..


అసెంబ్లీ ఎన్నికల సీజన్‌ను మించిన రాజకీయ యుద్ధం తెలంగాణలో ఇప్పుడు నడుస్తోంది. ఒకవైపు ఫోన్‌ ట్యాపింగ్‌, మరోవైపు గేట్లు ఎత్తేస్తున్నామంటూ ఆపరేషన్‌ ఆకర్ష్‌, ఇవిగాకుండా కరువు పరిస్థితులు.. ఇవన్నీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ మూడు అంశాలపై కొన్నిరోజులుగా సాగుతున్న ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ రచ్చను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.. బుధవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఫోన్ ట్యాపింగ్ నుంచి, ఆపరేషన్ ఆకర్ష్.. కరువు పరిస్థితులపై మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. తనకు ఇల్లీగల్‌ విషయాలతో సంబంధం లేదన్నారు. రేవంత్ లీకు వీరుడు.. అని.. తాను ట్యాపింగ్‌ చేయలేదంటూ స్పష్టంచేశారు. ఏదైనా ఉంటే లీగల్‌గా పోరాడుతామని కేటీఆర్‌ పేర్కొన్నారు. 2004 నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నారు. రేవంత్‌ దీనిపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘‘ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టము. తాట తీస్తాం.. నేను భయపడను..’’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వివరాలు అన్ని రేవంత్ రెడ్డికి పంపిస్తామన్నారు. 


కాంగ్రెస్ కు హైదరాబాద్ ఓటు వేయదు, అది అందరికీ తెలుసు, అందుకే హైదరాబాద్ లో ప్రజలపై కక్ష కట్టారా..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నారు.. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి.. అంటూ ప్రశ్నించారు. బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయి.. మీకు నిజాయితీ ఉంటే ఫ్రీ గా నీళ్ల ట్యాంకర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال