అనాథ విద్యార్థులకు చేయూత నిద్దాం* - రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్

 *అనాథ విద్యార్థులకు చేయూత నిద్దాం*

- రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్ 



- *విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ*



అనాథ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్ పిలుపు నిచ్చారు. మ్యాన్ కైండ్ ఫార్మా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం రెడ్ క్రాస్ అనాథ ఆశ్రమ విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, విద్యా సామాగ్రి, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ శామ్యూల్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావం తో అనాథ ఆశ్రమానికి చేయూత నివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జి.రమణయ్య, కోశాధికారి జగపతి రావు,జూనియర్,యూత్ రెడ్ క్రాస్ సమన్వయ కర్తలు అశ్విని చంద్రశేఖర్, బాబుల్ రెడ్డి, మేనేజర్ నరసింహ, మ్యాన్ కైండ్ ఫార్మా లిమిటెడ్ ప్రతినిధులు రాజ్ కుమార్, శివ కుమార్ రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow