సిగ్గుందా రేవంత్ రెడ్డి అంటున్న డీకే అరుణ!! నన్ను దొరసాని అంటావా క్షమాపణ చెప్పు

 Dk అరుణ..💥💥

సంచలనpress meet💥💥




సిగ్గుందా రేవంత్ రెడ్డి అంటున్న డీకే అరుణ!! నన్ను దొరసాని అంటావా క్షమాపణ చెప్పు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  డీకే అరుణ మీడియా సమావేశంలో దొరసాని అని పిలిచినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 అలాగే సిగ్గుందా అంటూ ముఖ్యమంత్రిని డీకే అరుణ మీడియా సమావేశంలో నిలదీశారు మీ ఇంటి ఆడవాళ్ళని ఇలాగే దొరసాని పిలుస్తావా అంటూ ప్రశ్నించారు.

పాలమూరులో నీ రాజకీయ ప్రస్థానం మొదలైంది కదా మిడ్జిలు జెడ్పిటిసి నుండి పాలమూరు ఎమ్మెల్సీగా కొడంగల్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మల్కాజిగిరి ఎంపీగా పాలమూరుకు ఏమి సాధించావో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తెలంగాణ ఉద్యమం సమయంలో నేను కష్టపడి జీవో ఇప్పించాను కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి సర్వేకు జీవో ఇప్పించిన తర్వాతనే ప్రాజెక్టు ముందులకి కదిలింది అప్పుడు నువ్వు నీ పార్టీ ఎక్కడున్నారు అని నిలదీశారు.

సందర్భంగా రేవంత్ రెడ్డికి ప్రశ్నల మీద ప్రశ్నలు విసిరిన భాజపా పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ.

మీ పార్టీకి కేంద్రంలో ప్రస్థానమే లేదు పాత పార్లమెంటు భవనానికి కొత్త పార్లమెంటు భవనానికి తేడా తెలియని మీరు దేశాన్ని వెలుతారా అంటూ ఎద్దేవా చేశారు

==============

రేవంత్ రెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన Dk అరుణ

===================

 👉🏻 మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబర్దార్..

నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోను..


👉🏻 నువ్వు cm వా..? ని మాటలెంది..? ని కథ ఏందీ..? నోటికొచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేస్తే.. చూస్తూ ఊరుకోను..


👉🏻 పార్లమెంట్ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డికి ఓటమి భయంపట్టుకుంది 


👉🏻 cm రేవంత్ కు తన ప్రభుత్వంపై తనకే అభద్రతాభావం మొదలైంది. 


👉🏻 brs, కాంగ్రెస్ కుమ్మక్కయింది. అదీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పుడు ప్రచారం బయటపడింది 


👉🏻 ఈ విషయంలో brs తాను తోడుకున్న గుంతలో అదే పడింది 


👉🏻 రేవంత్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది అందుకే నన్ను రాజకీయంగా ఎదుర్కొలేక నాపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు 


👉🏻 రేవంత్ నన్ను కించపరుచేలా దొరసాని అని మాట్లాడినందుకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి 


. 👉🏻 అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎదిబడితే అది మాట్లాడితే అరుణమ్మ చూస్తూ ఊరుకోదు 


👉🏻 ఈ జిల్లా ప్రజలు నిన్ను ఎమ్మెల్యే గా ఇన్ని సార్లు గెలిస్తే నువ్ పాలమూరు కోసం ఎం చేసావో చెప్పు 


👉🏻 మిస్టర్ రేవంత్ రెడ్డి.. వ్యక్తిగత చిల్లర రాజకీయాలు బంద్ జేసుకో... నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. 


👉🏻 రాజకీయంగా మాట్లాడితే మంచిది.. లేకుంటే ఖాబార్ధార్.. 


👉🏻 రేవంత్ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకో... 


👉🏻 cm పదవి వచ్చింది.. అయినా మీ తీరు మార్చుకోకపోతే.. ఎలా ఇంకా ప్రతిపక్ష నేతగానే మాట్లాడితే ఎలా..?


👉🏻 జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యావని సంతోషపడుతుంటే.. నువ్ ఎం మాట్లాడుతున్నావ్..? కొంచమైనా తెలీవి ఉండొద్దా..? మీ ఇంట్లో ఆడోళ్ళను ఇలానే దొరసాని అని మాట్లాడుతావా..? 


MLC ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై

       ===============

👉🏻 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం అంటున్నవ్ కదా.. రేవంత్ ఎలా గెలుస్తావ్..?


👉🏻  ఓట్లు. నోట్లు.. కోట్లు అంటున్నవ్ కదా.. ఓటుకు.. నోటు... వ్యవహారం నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు కదా... 


👉🏻 ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఎన్ని కోట్లు ఇచ్చి ఓట్లు కొంటున్నావో చెప్పు.. ఎట్లా గెలుస్తావ్.. నీకున్న ఓట్లన్ని..? 


👉🏻 నువ్ ఎంపీగా ఉండి.. ఈ జిల్లాకు ఎం చేసావో చెప్పు. 

పాలమూరుకు జాతీయ హోదా

            ------------------

👉🏻 పాలమూరు ప్రాజెక్ట్ తెచ్చిందే అరున్నమ్మ కదా...  ఆ నాడు నువ్ ఎటుపోయావ్.. ఎక్కడున్నావో నువ్ ఎం చేసావో చెప్పు.


👉🏻 నువ్ ఈ పాలమూరు జిల్లాకు ఎం ఇచ్చవో చెప్పు 


ఈ జిల్లాకు అన్ని మేమిచ్చినవే

👉🏻 పాలమూరులో హైవే లు మేము వేసినవే..  రైల్వే లైన్ లు వేసినవే మేము, ముద్ర లోన్స్ ఇచ్చాము, రేషన్ బియ్యం ఇచ్చాము.


👉🏻 మరి మీ ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి అయినా అమలు చేశావా..? 


👉🏻 పూటకో మాట మాట్లాడటం.. రేవంత్ కు అలవాటే.. 


👉🏻 మేము అరు గ్యారంటీలు అమలు చేయబోమని రేవంత్ ఒప్పుకున్నాడు. 


👉🏻 అరుగ్యారంటీలలో ఎన్ని అమలు చేసావో చెప్పు.. మహిళలకు 2500 ఇచ్చావా..?

రైతులకు రైతు బంధు ఇచ్చావా..?

రుణ మాఫీ ఇచ్చావా..? 

నిరుద్యోగులు కు 4000 భృతి ఇచ్చావా.? 

500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చావా..? 


👉🏻 ఎం ఇచ్చావని మీకు ఓట్లడుగుతున్నావ్ 


పాలమూరుకు జాతీయ హోదాపై..

------------------

👉🏻 అరుణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉంటే జాతీయ హోదా తీసుకొస్తుందా..?


👉🏻 జాతీయ ఉపాధ్యక్షురాలి.. పదవికి.. కాబినెట్ అధికార పదవులకు తేడా తెలియదా..? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం దురదృష్టకరం 


👉🏻పాలమూరు జాతీయ హోదా గురించి మాట్లాడే అర్హత

కాంగ్రెస్ కు  లేదు 


👉🏻 ఆ చిత్తశుద్దే ఉంటే విభజన చట్టంలో ఈ అంశాన్ని ఎందుకు పెట్టలేదు 


👉🏻 పాలమూరుకు జాతీయ హోదా హామీ అంటున్నారు కదా.. అప్పటి dpr.. ఇప్పుడున్న dpr ఒకటే నా..?


👉🏻 పాలమూరు జూరాల నుంచే ఉండాలని అరుణమ్మ చాలా సార్లు ఒక్కతే ఆనాడు పోరాడింది.


👉🏻 మిస్టర్ రేవంత్ నీకు చిత్త శుద్ధి ఉంటే..పాత పాలమూరు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇప్పించు.. జాతీయ హోదా పై  అప్పుడు మాట్లాడుతా..


పాలన చెత్తగాక.. చిల్లర కథలు

👉🏻 రాష్ట్రంలో తాగు, సాగు నీటి కష్టాలు మొదలయ్యాయి.. ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు 


👉🏻దేశంలో కాంగ్రెస్ లేదు అనేది..

👉🏻 మీకు ప్రధాని అభ్యర్థి లేదు మరి ఎవర్ని చూసి ఓట్లయాలి. పాలమూరు ప్రజలు మరోసారి మోసపోవాలా..?

రాహుల్ ని ప్రధానిగా మిరే ఒప్పుకోవట్లేదా..?

👉🏻 మాకు మా ప్రధానిగా మోదీ ఉన్నాడు.. మరి మీకు ఎవరున్నారు..? 

👉🏻  మహబూబ్ నగర్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీ లు పెట్టారు.... అందులో వాళ్ళు చెప్పుకుంటున్న రాహుల్ ఫోటో లేదు వాళ్ల పార్టీ అధ్యక్షుడి ఫోటో లేదు. 

👉🏻 అంటే వాళ్ల ప్రధాని ఎవరో వాళ్ళకే క్లారిటీ లేదని సెటైర్ 

👉🏻 వీళ్ళకు ఢిల్లీ లో లీడర్ ఎ లేనప్పుడు.. వాళ్లకు ఎందుకు ఓటేయ్యాలి.. మరోసారి మోసపోవడానికా... 

 వంశీకి చురకలు

👉🏻 కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కి పెద్ద పెద్ద ఫ్లెక్సీ లు, హార్డింగులు పెట్టుకోవడం కాదు.. కొత్త పార్లమెంట్ కట్టిన సంగతి తెలుసుకోవాలి. 



👉🏻 ఇలాంటి వ్యక్తి ఢిల్లీకి వారధి అంట.. ప్రజలే అలోచించి ఓటేయ్యాలి 

👉🏻 దేశం కోసం మోదీ.. పాలమూరు కోసం అరుణమ్మను గెలిపించాలని ప్రజలు ఫిక్స్ అయ్యారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow