నాగర్ కర్నూల్ బరిలో ఆ పార్టీ నుంచి పోటీ చేసేది ఇతడేనా..

 నాగర్ కర్నూల్ బరిలో ఆ పార్టీ నుంచి పోటీ చేసేది ఇతడేనా..

టికెట్ కోసం ప్రయత్నాలు .. ప్రయాణాలు అందుకేనా?

ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థి దొరికినట్టేనా?



ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికిన జడ్చర్ల బారాస నాయకులు.


భారతీయ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాదు నుండి అల్లంపూర్ కు వెళుతున్న సమయంలో జడ్చర్ల లోని జాతీయ రహదారి 44 మీద సింధూర హోటల్ దగ్గర బారాస కార్యకర్తలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికి శాలువ కప్ప గుచ్చాలి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

సొంత పని మీద అలంపూర్ వెళ్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని మీడియా పలు విషయాలపై ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు.

కవిత కేసు కోర్టులో ఉంది ఇప్పుడు మాట్లాడడం సరైన సమయం కాదు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది త్వరలోనే తెలుస్తది అన్నారు.

బారాసలో చేరినప్పుడు ఎలాంటి షరతులు పెట్టలేదు కానీ నాగర్ కర్నూల్ పార్లమెంటు బరిలో నిలబడే అందుకు ప్రయత్నాలు చేస్తున్నాను అదే పని మీద అల్లంపూర్ వెళ్తున్నాను అని అన్నాడు అలాగే సిద్ధాంత పరంగా కేసీఆర్ తో విభేదించే తప్ప పార్టీ మీద గాని కెసిఆర్ మీద గాని ఎలాంటి వివక్ష లేదు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీఎస్పీ లో ఉండి ప్రభుత్వ విధానాల పైన పోరాడాను పార్టీపైన కాదు అని అన్నారు.

ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని ప్రజలను ప్రలోభ పెడుతుంది అన్నారు.

త్వరలోనే కేసీఆర్ నుండి తీపికపురు వస్తుంది అంటూ విశ్వాసం వ్యక్తపరిచారు

ఈ కార్యక్రమంలో మూడో మాజీ డైరెక్టర్ బోయ శ్రీకాంత్ కౌన్సిలర్ శశికిరణ్ శంకర్ నాయక్ ఫరూక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow