Varun Tej Matka: పీరియాడిక్ థ్రిల్లర్‌తో మట్కా గ్లింప్స్‌..వ‌రుణ్ తేజ్ ఫ్యాన్స్కు ఫుల్ మిల్స్

Caption of Image.

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej)  డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారు.పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్ (Karuna Kumar) డైరెక్షన్లో వరుణ్ తేజ్ మట్కా (Matka) మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఇవాళ (జనవరి 19న) వరుణ్‌ తేజ్‌ బర్త్డే సందర్భంగా ఫ‌స్ట్‌లుక్‌తో పాటు మట్కా’ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. హాలీవుడ్ సినిమా గాడ్ ఫాదర్, బాలీవుడ్ స్కామ్ మూవీ 1992ల ఫీల్ ఇస్తూ మట్కా  గ్లింప్స్‌ ఆకట్టుకుంది. గ్లింప్స్‌లో వ‌రుణ్‌తేజ్ ముఖం మాత్రం చూపించ‌కుండా మిగ‌త పాత్ర‌ల‌ను రివీల్ చేశారు మేక‌ర్స్. ఇక గ్లింప్స్ మ‌ధ్య‌లో వరుణ్ ఎవరికో ప్రామిస్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. వరుణ్ తేజ్ మాఫియా డాన్ కైండ్ ఆఫ్ స్టైలిష్ మేకోవర్ లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్కు ఫుల్ మిల్స్ గ్యారెంటీ అనేలా ఉంది. 

ఈ మూవీ కథను 24 ఏళ్ళ టైమ్ పిరియాడ్ నేపథ్యంలో సాగుతూ..1958-1982 మధ్య జరిగే ఈ కథతో యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నరట. వరుణ్ తేజ్కు జోడిగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), నోరా ఫతేహి(Nora Fatehi) నటిస్తున్నారు. 

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ మూవీను నిర్మించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా సురేష్ పనిచేస్తున్నారు. ఇక సౌత్‌లో మోస్ట్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ లో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రియాసేత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

  • Beta
Beta feature
©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/pc7faM8
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال