హైదరాబాద్: జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘హాఫ్ డే’ సెలవు ప్రకటించింది. దీంతో ఆ రోజున హైదరాబాద్‌లో బ్యాంకులకు కూడా సెలవు ఉంటుందా అని చాలామంది సెర్చ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బ్యాంకులకు జనవరి 22న సెలవు లేదు. అయితే సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల వరకు బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
హైదరాబాద్‌లో బ్యాంకులకు రానున్న సెలవులు
నగరంలోని బ్యాంకులకు జనవరి 2024లో రానున్న సెలవుల జాబితా క్రింది విధంగా ఉంది.
- జనవరి 21: ఆదివారం
- జనవరి 26: గణతంత్ర దినోత్సవం
- జనవరి 27: నాల్గవ శనివారం
- జనవరి 28: ఆదివారం
ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు:
అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం సగం రోజు మూత పడనున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు మధ్యాహ్నం 2:30 గంటల వరకు సగం రోజులు మూసివేయబడతాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు, కొన్ని రాష్ట్రాలు కూడా జనవరి 22న ‘హాఫ్-డే’ సెలవు ప్రకటించాయి.
త్రిపుర, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు కూడా సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల వరకు సగం రోజులు మూసివేయబడతాయి.
‘ఉద్యోగుల మనోభావాలు, వారి నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు రామ మందిర ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు, కేంద్ర సంస్థలు, 2024 జనవరి 22న మధ్యాహ్నం 2:30 గంటల వరకు సగం రోజు మూసివేయాలి’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.