జడ్చర్ల : ప్రభుత్వ శాఖలో లంచాలు తీసుకునే అధికారులు రోజురోజుకు ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉన్నారు. విసిగి వేసారిన బాధితులు చేసేదిలేక చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించి న్యాయం పొందుతున్నారు. అందులో భాగంగా సోమవారం జడ్చర్ల సర్కిల్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లంచాలు తీసుకోవడంలో అందెవేసిన చేయిగా ఆ శాఖ సిబ్బందే చెబుతున్న బాలాజీను ఎసిబి అధికారులు వలవేసి పట్టుకున్నారు. టి ఎఫ్ టి లైసెన్స్ జారీ విషయంలో రూ.65000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు సమచారం. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పలు ఫైళ్లను తనిఖీలు చేపడుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
టి ఎఫ్ టి లైసెన్స్ జారీ విషయంలో 65000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జడ్చర్ల ఎక్సైజ్ శాఖ సిఐ బాలాజీ ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పలు ఫైళ్లను తనిఖీలు చేపడుతున్నారు