మహబూబ్ నగర్ జిల్లాలోని దివ్యాంగులకు ఈనెల 9 నుంచి 31వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి యాదయ్య గురువారం తెలిపారు. శారీరక వికలత్వం కలిగిన దివ్యాంగులకు 9, 23, 30 తేదీల్లో, వినికిడి లోపం, మానసిక వికలాంగులు, కంటి చూపు లోపం కలిగిన వారు 10, 24, 31 తేదీల్లో సదరం క్యాంపులకు హాజరు కావాలన్నారు.
Tags
News@jcl