తుమ్మినా.. దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది

Kishan Reddy: తుమ్మినా.. దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది

 



అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటారని.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు బీజేపీరాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శించారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలన్నారు.

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటారని.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు బీజేపీరాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శించారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలన్నారు. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించి కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను కాలరాసిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

Loaded6.44%
Remaining Time 10:16

సీనియర్ సభ్యుడి ఆధ్వర్యంలోనే రెగ్యులర్ స్పీకర్‌ను ఎన్నో కోవాలన్నారు. స్పీకర్ ఎన్నికను నిలిపివేయాలని గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. మజ్లిస్ పార్టీతో ఒప్పందం మేరకే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేశారన్నారు. తుమ్మినా.. దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ మజ్లిస్‌తో అంటకాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me