BJP SELF RUN OUT IN TSమోది అమిత్ షా చాణక్యం.. రాజకీయమా.. అబ్బా ఏం రాజకీయం.. రాజకీయమా నీ రాజకీయానికి జోహార్లు...

 మోది అమిత్ షా చాణక్యం.. 




రాజకీయమా.. 

అబ్బా ఏం రాజకీయం..

రాజకీయమా నీ రాజకీయానికి జోహార్లు... 


తెలంగాణలో చచ్చుబడి ఉన్న బిజేపిని తన రెక్కల కష్టంతో పార్టీని కాంగ్రెస్ కంటే ముందు కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా తయారుచేసిండు


అప్పుడు పాపం రేవంత్ మీద కాంగ్రెస్ సీనియర్లు రోజుకో సమస్యను సృష్టించి గందరగోళం లేపుతున్న సమయం


క్రమక్రమంగా రేవంత్ పార్టీ పై పట్టు పెంచుకుంటూ కాంగ్రెస్ ను పోటీలో నిలబెట్టిండు 


తెలంగాణా లో త్రిముఖ పోటీ  తప్పదని గ్రహించిన బిజెపి అనూహ్య నిర్ణయాలు తీసుకుంది 


పార్టీ మాంచి ఊపుమీదున్న దశలో అకస్మాత్తుగా బండి సంజయ్ ని మార్చడం ఒక నాటకం


కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చెయ్యడం కూడా బిజేపి స్వపక్షానికి,విపక్షాలకు,ప్రజలకు, విశ్లేషకులకూ కాడా అంతు చిక్కకుండా ఆడిన ఓ అద్భుత నాటకం ఆడింది 


బిజెపి ఏదైనా నిర్ణయం తీసుకుంటే పని జరిగే దాక మీడియాకే కాదు మూడో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్తది 


అట్లా నేటి కేసిఆర్ ఓటమికి ఆనాడే బండి సంజయ్ ని మార్చి బీజం వేసింది


ఏదో కేసీఆర్ కు కిషన్ రెడ్డి దగ్గరని అధిష్టానంతో కిషన్ రెడ్డి కేసీఆర్ కు లోపాయికారి ఒప్పందం కుదిర్చి కవితను లోపలెయ్యకుండా కాపాడారని జనం నమ్మేలా అయోమయంలో పడేసే  నాటకమాడింది 


ఈ విషయం బండి సంజయ్ కి బాగా తెలుసు పార్టీ విధేయుడైన సంజయ్ ఆటను బాగా రక్తి కట్టించాడు


కొద్ది రోజులు కావాలనే సంజయ్ ని సైలెంట్ మోడ్ లో పెట్టారు 


ఆ దశలో అయోమయానికి గురైన స్వపక్షంలోని వారు మిగతా వారు కాంగ్రెసే ప్రత్యమ్నాయమని అందరు కాంగ్రేస్లోకి వలసలు పోయేలా చేసారు 


బలమైన నాయకుల వలసలతో రేవంత్ అద్భుత నాయకత్వ లక్షణాలతో అంది వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నాక 


ఇంకా చాలదన్నట్టు కిషన్ రెడ్డి అధిష్టానం  కేసిఆర్ తో కలిసినట్టు భ్రమ కల్పిస్తూ 

పదే పదే నన్ను కుట్రపన్ని ఊడపీకిచ్చిర్రు కదా అని సంజయ్ చెప్పించారు 


బిజెపి ఇంకొక అనూహ్యమైన ఎత్తుగడ వేసి మంద కృష్ణ మాదిగ గారితో చేతులు కలపడం


ఏబిసిడి వర్గీకరణ చేస్తామని దళితులను కేసీఆర్ కు ఓట్లెయ్యకుండా ఎమ్మార్పియస్ తో బిజపికే ఓటెయండని ప్రచారం చేయించారు


అప్పటికే బిఆరెస్ ఓటు బ్యాంకు రేవంత్ కొల్లగొట్టిండు


దళిత బంధుతో కేసిఆర్ కు ఉన్న దళితుల ఓట్ బ్యాంకును కూడా మంద కృష్ణ గారిని రంగంలోకి దించి ఆత్మగౌరవం పేరుతో వర్గీకరణ పేరుతో పూర్తిగా దళితుల ఓట్లను  కేసిఆర్ కు పడకుండా బిజెపికి వేయించుకుని ఓట్లు చీల్చి కాంగ్రెస్ గెలుపుకు రూట్ క్లియర్ చేసారు.. 


కారణం.......

కేసిఆర్................


తెలంగాణ రాష్ట్ర సమితి

ఎప్పుడైతే

భారత రాష్ట్ర సమితిగా

కేసీఆర్ పేరు మార్చి దేశమంతట విస్తరించుటకు ప్రణాళికలు సిద్దం చేసుకుని పర్యటనలు మొదలయ్యాయో


అప్పుడే కేసీఆర్ దుకాణం ముందు తెలంగాణ ముయ్యాలనే  స్కెచ్ పడ్డది


కేసిఆర్ బలమైన నేత

అద్బుతమైన వాగ్దాటి ఉన్న నేత

హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ లలో అనర్గళంగా మాట్లాడుతూ  ఆయా స్థానిక సమస్యలను ఉటంకిస్తూ రాష్ట్రాలకు రాష్ట్రాలనే మార్చ గలిగే దమ్మున్న నేర్పరి 


తెలంగాణ ను తెచ్చిన నేతగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన నేత

కాబట్టి కేసీఆర్ మాటను దేశ ప్రజలు నమ్ముతరు 


దానికి తగ్గట్టుగా పంజాబ్, హర్యానా, డిల్లీ, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ లలో కార్యాచరణ మొదలుపెట్టిండు

 

మోడికి ప్రత్యమ్నాయమని దేశం మొత్తం తనవైపు తిప్పుకునేలా ప్రచారంతో ఫ్లెక్సిలతో , సోషల్ మీడియాతో బిజెపి పతనానికి పునాది బలంగా వేసిండు


కాంగ్రెస్ కంటే ముందు ముందు బిఆరెస్ తో ఎక్కువ ప్రమాదమని గ్రహించి కేసిఆర్ ను కట్టడి చేయడానికి తెలంగాణలో రాష్ట్ర  బిజెపి ని పణంగా పెట్టి విజయవంతంగా కేసిఆర్ ను దెబ్బ కొట్టి తమకు భవిష్యత్తులో పోటికి రాకుండా దేశంలో బిఆరెస్ విస్తరించకుండా నియంత్రించారు


కాంగ్రెస్ కు బంగారు పల్లెంల పెట్టి తెలంగాణను అప్పగించి జాతీయ నాయకత్వం ఫోకస్ అంతా తెలంగాణ మీద పెట్టేలా చేసి ఒక్క రాష్ట్రం వదులుకుని మూడు రాష్ట్రాల్లో దెబ్బ కొట్టారు 


బిజెపి ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఇటు కేసిఆర్ ను అటు కాంగ్రెస్ ను జాతీయ స్థాయిలో దెబ్బ కొట్టారు 


కాంగ్రెస్ అధినాయకత్వానికి  తెలంగాణ లో గెలిచినందుకు  సంబరపడాలో 

అటు రాజస్థాన్, మధ్యప్రదేశ్,చత్తీస్ గడ్ లలో ఓడిపోయినందుకు బాదపడాలో అర్దం కాని పరిస్తితిని కల్పించారు .. 

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me