
తన గురించి రూమర్స్, గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్న ఓ జర్నలిస్టుపై మండిపడ్డారు నటి రేణు దేశాయ్(Renu Desai). సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఆమె ఆ జర్నలిస్టుపై ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. అంకుల్.. మీరు నా నామస్మరణ చేస్తూ డబ్బులు సాధిస్తున్నారు. నా పేరుమీద మీరు డబ్బులు సంపాదిస్తుండటం నాకు సంతోషమే కానీ.. నటీనటులపై గాసిప్స్ చెప్పి కాకుండా మీ సొంత ప్రతిభతో డబ్బులు సంపాదిస్తే బాగుంటుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది.
మీరు మాట్లాడుతున్న నటిని ఎప్పుడూ కలవలేదు, తన గురించి కూడా మీకు ఏమీ తెలియదు, అయినా సరే తన గురించి ఏదోఒకటి చెప్తూనే ఉంటారు. మన హిందూ సాంప్రదాయాల్లో మహిళలను దుర్గాదేవి, కాళీమాత వంటి శక్తి స్వరూపాలతో పోల్చుతారు కానీ.. మీలాంటి వాళ్లు మాత్రం పురుషులు లేకుండా స్త్రీలు ఏమీ చేయలేరని చెప్తూ ఉంటారు.. అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రేణు దేశాయ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆమె రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఈ సినిమాలో హేమలత లవణం పాత్రలో మెప్పించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
from V6 Velugu https://ift.tt/TxfmWOd
via IFTTT