*
జడ్చర్ల :
హాస్టల్లో ఉండి చదవడం ఇష్టం లేక తన తల్లి హాస్టల్ కు తీసుకు వెళ్తుండగా ఆటో దిగి ఏడవ తరగతి విద్యార్థి పారిపోయిన ఘటన జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత బజారుకు చెందిన సువర్ణ తనకు ఉన్న ఇద్దరు సంతానంలో సంవత్సరాలు ఏడవ తరగతి విద్యార్థిని జడ్చర్ల పట్టణంలోని ఆలూరు రోడ్ లో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల నవాబుపేట లో ఇటీవల రెండు నెలల క్రితం తల్లి సువర్ణ తన కుమారుడైన అభిరామ్ ఏడవ తరగతిలో జాయిన్ చేసింది కాగా హాస్టల్లో ఉండి చదవడం ఇష్టం లేని బాలుడు అనేకమార్లు హాస్టల్ నుండి ఇంటికి పారిపోయాడని ఈ క్రమంలోనే తల్లి ఓ శుభకార్యానికి ఇంటికి తీసుకెళ్లగా తిరిగి శనివారం ఉదయం హాస్టల్ వద్దకు ఆటలో తీసుకువస్తుండగా హాస్టల్ వద్దకు వద్ద చేరుకోగానే ఆటో దిగిన విద్యార్థి అభిరామ్ 10 పారిపోయాడని దీంతో చుట్టుపక్కల తో పాటు బంధువుల ఇండ్లలో వెతికిన విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో జడ్చర్ల పోలీస్ స్టేషన్లో తన కుమారుడి మిస్సింగ్ కేసు నమోదు చేయించింది. ఈ మేరకు విద్యార్థి తల్లి సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు.