ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా అడవుల్లో 'ఎగిరే పాములు' అనే కథ దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది.
స్నేక్ ఫ్రెండ్ అయిన అవినాష్ యాదవ్ దీనిపై ఆసక్తికర విషయాలు చెప్పారు. బ్రాంజ్ బ్యాక్ ట్రీ స్నేక్.. ఈ అడవుల్లోని చెట్లపై వేగంగా కదులుతూ ఉంటుంది. అది ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పాముకి విషం ఉండదు. కానీ ఎక్కువ దూరం దూకగలదు. ఈ దూకుడు సామర్థ్యం కారణంగా దీనిని 'ఎగిరే పాము' అని స్థానికంగా పిలుస్తారు. ఈ ఎగిరే పాము అంటే.. స్థానికులకు విపరీతమైన భయం ఉంది. అదే సమయంలో దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంది. ఎందుకంటే ఇది అందరికీ కనిపించదు. ఇది ఒక రహస్యమైన జీవిగా గుర్తింపు పొందింది.ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా అడవుల్లో 'ఎగిరే పాములు' అనే కథ దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. స్నేక్ ఫ్రెండ్ అయిన అవినాష్ యాదవ్ దీనిపై ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఎందుకంటే ఇది అందరికీ కనిపించదు. ఇది ఒక రహస్యమైన జీవిగా గుర్తింపు పొందింది.కోర్బా రెప్టైల్ కేర్ అండ్ రెస్క్యూ సొసైటీ అధ్యక్షుడు అవినాష్ యాదవ్, ఈ పాము బ్రాంజ్‌బ్యాక్ ట్రీ స్నేక్ అని స్పష్టం చేశారు. ఈ పాము బరువు తక్కువగా, చాలా తేలికగా ఉంటుంది. అందువల్ల ఇది చెట్ల ఆకులపై నీటిలో ఈదినట్లు కదలగలదు. దీని శరీర నిర్మాణం, కదిలే విధానం... ఇది ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి.. ఎక్కువ దూరం దూకడానికి వీలు కలిగిస్తున్నాయి. ఐతే.. ఇది ఎగిరే పాము మాత్రం కాదు. కానీ.. ఇది దూకేటప్పుడు చూస్తే.. ఎగురుతున్న భ్రమను కలిగిస్తుంది.ఈ దూకుడు సామర్థ్యం కారణంగా స్థానికులు దీనిని 'ఎగిరే పాము' అని పిలుస్తారు. అయితే, అవినాష్ యాదవ్ ప్రకారం, బ్రాంజ్‌బ్యాక్ ట్రీ స్నేక్ పూర్తిగా విషం లేని పాము. ఇది మనుషులకు హానిచేయదు. ఈ పాము సాధారణంగా ప్రశాంతంగా, శాంత స్వభావం కలిగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఇది దాడి చేయడం కంటే తప్పించుకొని పారిపోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది.కోర్బా అడవుల్లో ఇలాంటి పాములు ఉన్నాయనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ ఇవి దట్టమైన అడవులు. ఈ అడవుల్లో వెళ్లిన వారికి అనుక్షణం భయం వేస్తుంటుంది. ఆ భయానికి తోడు.. ఎగిరే పాములు ఉన్నాయనే భావన వారిలో మరింత భయాన్ని పెంచుతుంది. ఈ నమ్మకం తరతరాలుగా కొనసాగుతోంది. స్థానిక గ్రామస్తులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా ఈ కథలకు జీవం పోస్తున్నారు. స్థానిక జానపద కథలలో కూడా ఈ పాముల గురించి ప్రస్తావన ఉంది.ఈ పాములు కనిపిస్తే, హాని చేయవద్దని, తనకు సమాచారం ఇవ్వాలని స్థానికులను అవినాష్ యాదవ్ కోరారు
. ఈ పాములు పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చిన్న జీవులైన బల్లులు, ఎలుకలు, పక్షులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ పాములను రక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు అని అవినాష్ తెలిపారు.వర్షాకాలం సీజన్‌లో కోర్బాలో పాములు బయటకు వచ్చే సంఘటనలు పెరుగుతాయి. ఎందుకంటే వర్షం కారణంగా వాటి పుట్టలు.. నీటితో నిండిపోతాయి. ఆ సమయంలో, వైన్ స్నేక్, బ్రాంజ్‌బ్యాక్ ట్రీ స్నేక్ వంటి జాతులు.. బయటి ప్రాంతాలకు వస్తాయి. అలాంటి సమయంలో వాటిని స్థానికులు చూస్తే.. భయపడతారు. అయితే, ఈ పాములు హానిచేయవనీ, వాటిని సురక్షితంగా జంగిల్‌లో విడుదల చేయవచ్చని యాదవ్ వివరించారు.వర్షాకాలం సీజన్‌లో కోర్బాలో పాములు బయటకు వచ్చే సంఘటనలు పెరుగుతాయి. ఎందుకంటే వర్షం కారణంగా వాటి పుట్టలు.. నీటితో నిండిపోతాయి. ఆ సమయంలో, వైన్ స్నేక్, బ్రాంజ్‌బ్యాక్ ట్రీ స్నేక్ వంటి జాతులు.. బయటి ప్రాంతాలకు వస్తాయి. అలాంటి సమయంలో వాటిని స్థానికులు చూస్తే.. భయపడతారు. అయితే, ఈ పాములు హానిచేయవనీ, వాటిని సురక్షితంగా జంగిల్‌లో విడుదల చేయవచ్చని యాదవ్ వివరించారు.