హైదరాబాద్: నగరంలోని గుడిమల్కాపూర్‌లో గల అంకుర హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంకుర హాస్పిటల్‌లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 3 ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. ఆస్పత్రిల్లో ఉన్న పేషెంట్లను రక్షించే పనిలో ఫైర్ సిబ్బంది ఉన్నారు. ఆస్పత్రిలో రోగులు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో రోగులు ఆందోళనలో ఉన్నారు. ఆయా ఫ్లోర్‌లో ఉన్న రోగులను సిబ్బంది బయటికి పంపించి వేస్తున్నారు. సంఘటనా స్థలానికి డీఅర్ ఎఫ్ బృందాలు చేరుకున్నాయి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Tags
News@jcl