AI Effect: గుగూల్ నుంచి 30 వేల మంది ఉద్యోగులు ఔట్

Caption of Image.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా Google లో ఉద్యోగులు  తమ ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. AI టెక్నాలజీ వినియోగంలో భాగంగా గూగుల్  భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులు సులభంగా, వేగంగా పూర్తి చేయొచ్చు. అందుకే పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. గూగుల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై దృష్టి పెట్టింది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంలో భాగంగా ఈ టెక్ దిగ్గజం దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సేల్స్ రంగంలో Ai  వినియోగం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నందున ఆ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని నిర్ణయించింది. దీంతో సేల్స్ రంగంలో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం పడనుంది. 

టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే  యాడ్స్ క్రియేషన్ ను ఆటోమేటిక్ రూపొందించేందుకు PMax  ఏఐ ఆధారిత టూల్స్ వినియోగిస్తోంది. దీని కారణంగా కంపెనీ వార్షిక ఆదాయం పెరిగింది. ఏఐ సామర్థ్యంతో పాటు ఉద్యోగుల అవసరం తగ్గడంతో గూగుల్  కు భారీగా లాభాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని Ai టూల్స్ ని ఉపయోగించాలని గూగుల్ నిర్ణయించడంతో కంపెనీ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/y7taWQD
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال