Telangana Assembly Elections: తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడుపెంచాయి. బీజేపీ అగ్రనేతల ప్రచారంతో హోరెత్తిస్తుంది. ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు వరుసగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలకు పదుపెడుతోంది. దీనిలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాత్రి హైదరాబాద్ చేరుకున్న నడ్డాకు బీజేపీ నేతలు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. ఐటీసీ కాకతీయలో బసచేశారు. ఇవాళ బీజేపీ ముఖ్య నేతల సమావేశమవుతారు నడ్డా. తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకి నిజామాబాద్ అర్బన్‌లో ప్రచారం చేస్తారు. అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆతర్వాత జేపీ నడ్డా సంగారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొంటారు.
ఎన్నికల ప్రచారం మొదలైన నాటినుంచి ఇప్పటికే పలు మార్లు తెలంగాణకు వచ్చారు జేపీ నడ్డా. పార్టీని బలోపేతం చేయడమే .. పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తున్నారు. ఈనెల 19న నారాయణపేట, చేవెళ్లలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో, మల్కాజిగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో కాంగ్రెస్ అవినీతి, బీఆర్ఎస్ కుటుంబ పాలనపై ఆరోపణలు చేశారు జేపీ నడ్డా. బీఆర్ఎస్ అవినీతిపై ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. దీంతో ఇవాళ్టి నడ్డా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
రాంకోఠిలో పీయూష్ గోయల్.. ఖైరతాబాద్‌లో గోవా సీఎం ప్రమోద్ .. కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో పవన్ ప్రచారం..
మరోవైపు తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల ప్రచారం కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ రాంకోఠిలో పీయూష్ గోయల్ ప్రచారం చేయనుండగా.. ఖైరతాబాద్‌లో గోవా సీఎం ప్రమోద్ పాదయాత్ర చేస్తారు. అటు సిరిసిల్ల బహిరంగ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాల్గొంటారు. మరోవైపు మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో కూడి జోరుగా ప్రచారం చేయిస్తుంది బీజేపీ. నిన్న వరంగల్‌లో పర్యటించిన పవన్.. ఇవాళ కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
Tags
News@jcl

