Bandi Sanjay : బీసీలు బీజేపీకి ఓటేయకపోతే.. వారిని ఏ పార్టీ నమ్మదు
రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, 50 శాతం ఉన్న బీసీలు బీజేపీకి ఓటు వేయకపోతే వారిని ఇతర పార్టీలూ నమ్మవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay : బీసీలు బీజేపీకి ఓటేయకపోతే.. వారిని ఏ పార్టీ నమ్మదు
బీసీయే సీఎం అని మోదీ ప్రకటించారు
Close Player
కేటీఆర్ యూజ్‌లెస్ ఫెలో.. ఒళ్లు కొవ్వెక్కి
నిరుద్యోగులను బూతులు తిడుతున్నారు
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల్లో ఏ పార్టీ వచ్చినా
ప్రభుత్వం కూలి.. మధ్యంతరం ఖాయం
మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫాంహౌస్‌లు
కట్టుకున్నారు.. పేదలకు మాత్రం గూడేదీ?
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి
గంగాధర, నవంబరు 22: రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, 50 శాతం ఉన్న బీసీలు బీజేపీకి ఓటు వేయకపోతే వారిని ఇతర పార్టీలూ నమ్మవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ‘మీ కోసం కొట్లాడి జైలుకు పోయినోళ్లను గెలిపిస్తారా... భూకబ్జా, చీటింగ్, అక్రమ సంపాదన కేసులు, రౌడీషీట్లు ఉన్న వాళ్లను గెలిపిస్తారా?’ అని ప్రజలను అడిగారు. ప్రజల కోసం పోరాడినందుకు దాదాపు 5 వేల మంది బీజేపీ కార్యకర్తలపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని, తనపై 74 కేసులు పెట్టారన్నారు. కానీ బీఆర్‌ఎస్ నాయకులపై భూకబ్జా కేసులు ఉన్నాయన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై 27 కేసులున్నాయని, అవన్నీ 420 కేసులని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌పై అక్రమ సంపాదన, గ్రానైట్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోతే తాము పోరాడి అమలు చేయించామన్నారు. ‘యూజ్‌లెస్ ఫెలో... ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయించాల్సింది పోయి తిడతావా? దవడ పళ్లు రాలకొడితే సరి. కండకావరమెక్కి మాట్లాడుతున్నవ్. మడతల చొక్కా.. అరిగిన రబ్బర్ చెప్పులేసుకున్న నీ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో’ అంటూ మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘మీ అయ్య ఉద్యోగాలిస్తానంటడు. నువ్వేమో నిరుద్యోగులను చెత్త నాకొడుకుల్లారా.. సన్నాసుల్లారా.. అని బూతులు తిడతావా? అని మండిపడ్డారు. సీఎంగా కేసీఆర్ ముఖమే చూడలేకపోతున్నామని, ఇక కండకావరమెక్కిన కేటీఆర్‌ను ఎవరు చూస్తారన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అర్ధంతరంగా కూలిపోవడం, మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యమన్నారు. ‘బీఆర్‌ఎస్ గెలిస్తే కేసీఆర్ తన కొడుకును సీఎం చేస్తాడు. అప్పుడు కవిత, హరీ్‌షరావు, సంతో్‌షరావు ఊరుకుంటారా? వాళ్లంతా తలో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లిపోతే ప్రభుత్వం ఉంటదా’ అని ప్రశ్నించారు. కాంగ్రె్‌సలో అందరూ సీఎంలేనని, ఒకరిని సీఎం చేస్తే మిగిలిన వాళ్లంతా తమ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని పార్టీని వీడతారన్నారు. ‘సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫాంహౌ్‌సలు కట్టుకున్నరు. కేసీఆర్ 100 రూముల ప్రగతి భవన్ కట్టుకున్నడు. మరి నిలువ నీడలేని పేదలకు మాత్రం గూడు ఎందుకు కల్పించలేదు? వాళ్లు చేసిన పాపమేంది?’ అని నిలదీశారు. ‘6 గ్యారెంటీలను మడిచి పెట్టుకోండి.. గెలిచాక అమ్ముడుపోబోమనే గ్యారెంటీ ఇవ్వగలరా’ అని కాంగ్రె్‌సను ఉద్దేశించి ప్రశ్నించారు. అవినీతిలో బీఆర్‌ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ ఏకంగా తలుపులు బార్లా తెరుస్తుందన్నారు. 12 శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నయని, 80 శాతమున్న హిందువులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ అని విమర్శించారు. ఓటమి ఖాయమని తెలిసి కేసీఆర్ తాంత్రిక పూజలను నమ్ముకున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పింఛన్, రుణమాఫీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళిత బంధు పథకాలు వస్తాయన్నారు.
25 నుంచి మోదీ ఎన్నికల ప్రచారం
హైదరాబాద్: ప్రధాని మోదీ 25 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మోదీ, 25న మధ్యాహ్నం 1.30 గంటలకు దుండిగల్ చేరుకుంటారు. హెలికాప్టర్‌లో బయలుదేరి 2.15 గంటలకు కామారెడ్డి చేరుకుంటారు. అక్కడి బహిరంగసభలో పాల్గొన్న అనంతరం 4.15 గంటలకు మహేశ్వరం చేరుకుంటారు. బహిరంగసభ అనంతరం, రాత్రికి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో బస చేస్తారు. 26న ఉదయం కన్హా శాంతివనానికి వెళతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు తూప్రాన్‌లో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. 3 గంటలకు బయలుదేరి 3.45 గంటలకు నిర్మల్ చేరుకుంటారు. బహిరంగసభలో పాల్గొన్న అనంతరం, హెలికాప్టర్‌లో దుండిగల్ చేరుకుంటారు. అదేరోజు రాత్రికి తిరుపతి వెళతారు. 27న ఉదయం తిరుపతి నుంచి బయలుదేరి హకీంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబాబాద్, కరీంనగర్ వెళ్లి అక్కడ బహిరంగసభల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న రోడ్డు షోలో మోదీ పాల్గొంటారు.
Tags
News@jcl


