Mallareddy Sensation : కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎవరుండాలో డిసైడ్ చేసేది నేనే..మంత్రి మల్లారెడ్డి

తన అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్ చర్చపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చెల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే డిసైడ్ చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు అభ్యర్థి ఉండాలో తానే డిసైడ్ చేస్తానని స్పష్టం చేశారు.
Mallareddy Sensation : కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎవరుండాలో డిసైడ్ చేసేది నేనే.. హైదరాబాద్ : తన అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్ చర్చపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చెల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే డిసైడ్ చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు అభ్యర్థి ఉండాలో తానే డిసైడ్ చేస్తానని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో కేఎల్ఆర్‌కు టికెట్ ఇప్పించింది తానేనన్నారు. మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూప్ గొడవలు తామే సృష్టిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధిష్టానంలో తనకు దోస్తులు ఉన్నారని వెల్లడించారు. ఐటీ అధికారులు తన ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేద తాను చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోయి... ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలు వింటున్నారన్నారు. మంత్రివర్గ విస్తరణ అంటే మల్లారెడ్డి పోస్ట్ ఊడుతుందనే ప్రచారం చేశారన్నారు. రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తరువాత గ్రాఫ్ పెరిగిందని మల్లారెడ్డి తెలిపారు. కొంతమంది మీడియా అసత్య ప్రచారం కక్షపురితంగా చేస్తోందన్నారు. త్వరలోనే మీడియా సంస్థ- ఏడాదికి నాలుగు తెలంగాణ యాస సినిమాలు తీస్తానన్నారు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలని మంత్రి మల్లెరెడ్డి తెలిపారు.
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me