జడ్చర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ .జానకి ఐపీఎస్



జడ్చర్ల టౌన్: పోలీస్ స్టేషన్‌లోని అన్ని ముఖ్య రికార్డులు, కేసుల నమోదులు, విచారణ లో పురోగతి, సెక్యూరిటీ ఏర్పాట్లు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాక. స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కమలాకర్ క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీసింగ్‌ను కొనసాగించాలని సూచనలు ఇచ్చారు. ప్రజలతో మానవీయంగా వ్యవహరించాలి, ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోవాలి, పెండింగ్ కేసుల‌ను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజల భద్రత మరియు న్యాయబద్ధతే పోలీసుల ప్రధాన కర్తవ్యము. ప్రతి పోలీస్ స్టేషన్ ఒక న్యాయదేవాలయంగా ఉండాలి. బాధితులకు న్యాయం కలిగించే విధంగా ప్రతి ఫిర్యాదునూ పరిశీలించి, తక్షణ స్పందన ఇవ్వాలి. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచే విధంగా విధులు నిర్వర్తించాలి అని పేర్కొన్నారు.

జాతీయ రహదారి 44 పై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని.

నిత్యం సరియైన ట్రాఫిక్ కదలిక కొనసాగాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని

జాతీయ రహదారి పక్కన వాహనాలను పార్క్ చేయకుండా నిర్బంధ చర్యలు తీసుకోవాలి.

హై స్పీడ్ వాహనాలపై పక్కాగా నిఘా ఉంచి, అవసరమైనచోట స్పీడ్ బ్రేకర్లు & హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల్లో రెగ్యులర్ గా పెట్రోలింగ్ చేయాలి.

బ్రేక్‌డౌన్ వాహనాలు లేదా రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను వెంటనే తొలగించేంచాలని, ఎస్పీ ఆదేశాలు జారీ 

చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال