ఎనీ టైం కరెంట్ తీగలు పట్టుకుని చూడు.. 24 గంటల కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుంది: ఎమ్మెల్సీ కవిత*

* హైదరాబాద్ :ఆగస్టు 10
పార్లమెంట్ వేదిక‌గా తెలంగాణ‌పై విషం చిమ్మిన బండి సంజ‌య్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత నిప్పులు చెరిగారు. క‌రెంట్ తీగ‌లు ప‌ట్టుకుంటే తెలుస్తుంది.. తెలంగాణ‌లో 24 గంట‌ల క‌రెంట్ వ‌స్తుందో లేదో’’ అని బండి సంజ‌య్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. బీఆర్ఎస్ఎల్పీలో గురువారం సాయంత్రం క‌విత మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో ఇవ్వాల బండి సంజ‌య్ విప‌రీత‌మైన అబ‌ద్ధాలు మాట్లాడార‌ని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జాతీయ హోదా ఇవ్వలేదు. మ‌ధ్యప్రదేశ్‌లో ఉన్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉన్నాయ‌ని చెప్పి రూ. 22 వేల కోట్లు ఇచ్చారు. కానీ, తెలంగాణకు ఇవ్వలేదు. నిన్న కేంద్ర మంత్రి నిషికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 86 వేల కోట్లు ఇచ్చామ‌ని అబ‌ద్ధాలు మాట్లాడారు. ఇవాళ కొన‌సాగింపుగా బండి సంజ‌య్ అదే మాట్లాడిండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ప‌ర్సనల్‌గా మా నాయ‌కుడిని బండి సంజయ్ తిట్టిండు.. అది ఆయ‌న విజ్ఞత‌కే వ‌దిలేస్తున్నా అని ఎమ్మెల్సీ క‌విత అన్నారు.ఆయ‌న మాట‌ల‌ను తెలంగాణ ప్రజ‌లు గ‌మ‌నిస్తున్నారని, 24 గంట‌ల క‌రెంట్ ఎక్కడ వ‌స్తుంద‌ని సంజ‌య్ ప్రశ్నించారు. క‌రీంన‌గ‌ర్ బీజేపీ ఆఫీసుకు లేదా హైద‌రాబాద్ బీజేపీ ఆఫీసుకు రా.. క‌రెంట్ తీగ‌లు ప‌ట్టుకో. రోజులో ఎనీ టైం ఎప్పుడైనా ప‌ట్టుకో.. క‌రెంట్ వ‌స్తుందా లేదా తెలుస్తది. పార్లమెంట్‌లో నిల‌బ‌డి అబ‌ద్దాలు మాట్లాడ‌టం స‌రికాదు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ప్రజ‌ల కోసం మాట్లాడాలి. తెలంగాణ కోసం మాట్లాడాలి. ఒక మంచి మాట మాట్లాడు.. ఒక మంచి విష‌యం చెప్పు. మ‌న హ‌క్కుల కోసం ఒక్క బీజేపీ ఎంపీ కూడా పెద‌వి విప్పి పార్లమెంట్‌లో మాట్లాడ‌లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదు. మిష‌న్ భ‌గీర‌థ‌కు రూ. 24 వేల కోట్లు ఇవ్వమని నీతిఆయోగ్ చెప్పినా దాన్ని ఇవ్వలేదు అని క‌విత క‌డిగిపారేశారు....
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me