పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు.[1] జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది.[2]
+
విషయాలు
1 ప్రాజెక్టు వివరాలు
2 పర్యావరణ అనుమతులు
3 జలాశయాలు, వాటి సామర్థ్యాలు
4 ప్రయోజనం పొందే ప్రాంతాలు
4.1 తాగునీరు, పరిశ్రమలు
4.2 సాగునీరు
5 మూలాలు
ప్రాజెక్టు వివరాలు
హైదరాబాదు నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలం, లక్ష్మీదేవిపల్లి వరకూ పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టి.ఎమ్‌సి చొప్పున మొత్తం 90 టిఎమ్‌సి నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యం.
సముద్ర మట్టం నుండి 269.735 మీ. ఎత్తున ఉన్న శ్రీశైలం జలాశయం నుండి 5 అంచెల్లో ఎత్తిపోసి 670 మీ. ఎత్తున ఉన్న లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీటిని చేరుస్తారు. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 లిఫ్టులు, 6 జలాశయాలూ నిర్మిస్తారు.
రూ. 35,200 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 10 న తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.[3]
ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో - మొత్తం నీటిని తరలించడానికి పంపుహౌసులు, జలాశయాలు, పైపులైన్లు, కాలువలు, సొరంగాలు నిర్మించి, తాగునీటి అవసరాలూ, పారిశ్రామిక అవసరాలూ తీర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు. రెండవదశలో సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువలు ఇతర సదుపాయాలను నిర్మిస్తారు.
పర్యావరణ అనుమతులు
ఈ పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంపాటు ప్రయత్నాలు చేసింది. ఈఏసీ సభ్యులు రకరకాల సందేహాల కారణంగా అనుమతుల్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను తిరస్కరించిన ఈఏసీ, ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కన పెట్టింది. అప్పుడు ఈఏసీ కోరిన విధంగా సమగ్రంగా ప్రాజెక్టు వివరాలను సమర్పించడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను తెలియపరుస్తూ, పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.[4]
2023, జూన్ 27న నిర్వహించిన ఈఏసీ 48వ సమావేశంలోనే పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఈఏసీ సభ్యులు పలు అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కోరుతూ అనుమతుల మంజూరును పెండింగ్‌లో పెట్టారు. 2023, జూన్ 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వాదనలు వినిపించడంతోపాటు పర్యావరణ ప్రభావానికి సంబంధించిన నివేదికలను ఈఏసీకి అందజేశారు. అందులో రెండో దశ అనుమతులు తీసుకోకుండా పనులు చేయడం వల్ల పర్యావరణానికి 153.69 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు, అందుకు నష్ట నివారణ ప్రణాళికతోపాటు సహజ వనరుల పెంపుదల ప్రణాళికల వివరాలును ప్రభుత్వం తెలిపింది.[5] ఆ నివేదికతో ఏకీభవించిన ఈఏసీ, 153.70 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీని జమచేయడంతోపాటు రూ.106 కోట్ల మేర పెనాల్టీని కట్టాలని షరతులు విధిస్తూ, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసినట్టు 2023, ఆగస్టు 10న విడుదల చేసిన 49వ ఈఏసీ మినట్స్ లో వెల్లడించింది.[6]
జలాశయాలు, వాటి సామర్థ్యాలు
గుట్టలను కలుపుతూ మట్టి కట్టలతో నాడు కాకతీయులు చెరువులను నిర్మించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ జలాశయాలను నిర్మించింది. ఆయా జలాశమాలకు స్థానికంగా గుట్టలపై కొలువైన దేవుళ్ళ పేర్లు పెట్టబడ్డాయి.[7]
ప్రాజెక్టులో భాగంగా నిర్మించే జలాశయాల వివరాలు ఇలా ఉన్నాయి:[8]
క్ర.సం. జలాశయం పేరు స్థలం కట్ట పొడవు (కి.మీ.) పూర్తి స్థాయి మట్టం పూర్తి స్థాయి
సామర్థ్యం (టిఎమ్‌సి)
వాడుకోగలిగే
నీరు (టిఎమ్‌సి)
ఆయకట్టు (ఎకరాల్లో)
1 అంజనగిరి జలాశయం నార్లాపూర్ 6.647 +345.000 మీ. 8.51 7.95 0
2 వీరాంజనేయ జలాశయం ఏదుల 7.716 +445.000 మీ. 6.55 5.91 0
3 వెంకటాద్రి జలాశయం వట్టెం 14.75 +542.000 మీ. 16.74 14.47 1,39,000
4 కురుమూర్తిరాయ జలాశయం కరివెన 13.185 +531.000 మీ. 17.34 16.9 1,90,000
5 ఉద్దండాపూర్ జలాశయం ఉద్దండాపూర్ 15.875 +629.000 మీ. 16.03 15.61 4,88,000
6 లక్ష్మీదేవిపల్లి జలాశయం రంగారెడ్డి జిల్లా, లక్ష్మీదేవిపల్లి 6.05 +670.000 మీ. 2.8 2.5 4,13,000
మొత్తం 64.223 67.97 63.34 12,30,000
ప్రయోజనం పొందే ప్రాంతాలు
తాగునీరు, పరిశ్రమలు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వలన జంటనగరాలకు తాగునీరు లభిస్తుంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 70 మండలాలకు చెందిన 1226 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని పరిశ్రమలకు నీరు అందిస్తారు.
సాగునీరు
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12,30,000 ఎకరాలకు నీరందించే ప్రణాళిక ప్రాజెక్టు రెండవ దశలో ఉంది. మండలాల వారీగా ఆయకట్టు ఇలా ఉంటుంది:[8]
జిల్లా నియోజకవర్గం మండలం ఆయకట్టు (ఎకరాల్లో)
మహబూబ్‌నగర్ దేవరకద్ర అడ్డకల్ 18,692
భూత్‌పూర్ 13,105
మూసాపేట్ 6,000
దేవరకద్ర 20,655
నియోజక వర్గంలో మొత్తం భూమి 58,452
జడ్చర్ల బాలానగర్ 30,311
రాజాపూర్ 10,000
జడ్చర్ల 38,585
మిడ్జిల్ 32,097
నవాబ్‌పేట 25,576
నియోజక వర్గంలో మొత్తం భూమి 1,36,569
మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ (గ్రామీణ) 9,692
హన్వాడ 12,527
నియోజక వర్గంలో మొత్తం భూమి 22,219
మక్తల్ మాగనూరు 264
మక్తల్ 17,549
నర్వ 5,918
ఊటుకూరు 34,281
నియోజక వర్గంలో మొత్తం భూమి 58,012
నారాయణపేట దామరగిద్ద 1,207
ధన్వాడ 15,734
కోయిలకొండ 25,794
నారాయణపేట 16,056
నియోజక వర్గంలో మొత్తం భూమి 58,791
*పర్గి గండీడ్ 24,414
నియోజక వర్గంలో మొత్తం భూమి 24,414
*KODANGAL కోస్గి 26,023
మద్దూరు 28,687
నియోజక వర్గంలో మొత్తం భూమి 54,710
మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం భూమి 4,13,167
వికారాబాదు *పరిగి దోమ 20,473
కుల్కచర్ల 10,412
పూదూరు 11,750
పర్గి 18,587
నియోజక వర్గంలో మొత్తం భూమి 61,222
తాండూరు బషీరాబాద్ 26,982
పెద్దేముల్ 19,958
తాండూరు 29,040
యాలాల 22,112
నియోజక వర్గంలో మొత్తం భూమి 98,092
వికారాబాదు కోటేపల్లి 11,622
బంట్వారం 5,985
ధరూర్ 21,357
మర్పల్లి 28,049
మోమిన్‌పేట్ 18,753
వికారాబాద్ 9,286
నియోజక వర్గంలో మొత్తం భూమి 95,052
*కోడంగల్ బొంరాస్‌పేట 29,063
కోడంగల్ 18,003
దౌలతాబాద్ 8,667
నియోజక వర్గంలో మొత్తం భూమి 55,733
చేవెళ్ళ నవాబ్‌పేట 12,276
నియోజక వర్గంలో మొత్తం భూమి 12,276
వికారాబాదు జిల్లాలో మొత్తం భూమి 3,22,375
నాగర్‌కర్నూలు అచ్చంపేట వంగూరు 1,357
చారకొండ 1,000
నియోజక వర్గంలో మొత్తం భూమి 2,357
నగర్‌కర్నూల్ బిజినపల్లి 7,712
తిమ్మాజీపేట 23,263
తాడూరు 4,082
నియోజక వర్గంలో మొత్తం భూమి 35,057
*కల్వకుర్తి ఊరుకొండ 4,482
కల్వకుర్తి 18,957
వెల్దండ 39,705
నియోజక వర్గంలో మొత్తం భూమి 63,144
నాగర్‌కర్నూలు జిల్లాలో మొత్తం భూమి 1,00,558
రంగారెడ్డి *కల్వకుర్తి ఆమనగల్లు 11,261
కడ్తాల్ 4,922
మాడ్గుల్ 30,609
తలకొండపల్లి 24,104
నియోజక వర్గంలో మొత్తం భూమి 70,896
చేవెళ్ళ చేవెళ్ళ 24,028
షాబాద్ 25,369
మొయినాబాద్ 28,535
శంకరపల్లి 19,331
నియోజక వర్గంలో మొత్తం భూమి 97,263
షాద్‌నగర్ ఫరూక్‌నగర్ 21,345
కొందుర్గ్ 18,395
చౌదర్‌గూడెం 13,500
కొత్తూరు 18,852
నందిగామ 10,000
కేశంపేట 1,969
నియోజక వర్గంలో మొత్తం భూమి 84,061
ఇబ్రహీంపట్నం మంచాల 15,621
యాచారం 28,612
ఇబ్రహీంపట్నం 29,185
హయత్‌నగర్ 12,496
నియోజక వర్గంలో మొత్తం భూమి 85,914
రాజేంద్రనగర్ శంషాబాద్ 6,601
నియోజక వర్గంలో మొత్తం భూమి 6,601
మహేశ్వరం మహేశ్వరం 8,251
కందుకూరు 10,914
నియోజక వర్గంలో మొత్తం భూమి 19,165
రంగారెడ్డి జిల్లాలో మొత్తం భూమి 3,63,900
నల్గొండ దేవరకొండ చింతపల్లి 10,454
చందంపేట 75
గుండ్లపల్లె 3,682
దేవరకొండ 11,773
నియోజక వర్గంలో మొత్తం భూమి 25,984
మునుగోడు మర్రిగూడ 4,016
నియోజక వర్గంలో మొత్తం భూమి 4,016
నల్గొండ జిల్లాలో మొత్తం భూమి 30,000
ప్రాజెక్టు మొత్తం 12,30,000
Tags
News@jcl.