సికింద్రాబాద్.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని బళ్లారి ఎక్స్ప్రెస్ కు బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో వెంటనే రైల్వే రక్షక దళ, జిఆర్పి పోలీసులు తనిఖీలు చేపట్టారు.. పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తుతెలియని వ్యక్తి నుండి రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న బళ్లారి ఎక్స్ప్రెస్ లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది..
డాగ్ స్క్వాడ్,బాంబ్ స్క్వాడ్ లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.. సికింద్రాబాద్ నుండి కర్ణాటకలోని బెల్గాం వరకు బళ్లారి ఎక్స్ప్రెస్ ప్రయనించనున్నట్లు తెలిపారు.. రైలులో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో ప్రయాణికులంతా ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు.. బళ్లారి ఎక్స్ప్రెస్ లోని అణువణువు పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నారు.. ట్రైన్ లో బాంబు ఉందని తెలియడంతో ఒకసారి ఆందోళనకు గురయ్యమని ప్రయాణికులు పేర్కొన్నారు.. రైల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం బాంబు లేదని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.. అనంతరం బళ్లారి ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో బయలుదేరింది..
Tags
News@jcl.