ఐదేళ్లలో GHMC కుక్కల నివారణకు పెట్టిన ఖర్చు 18 కోట్లు... మరేంటి దారుణాలు...??

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలు శత్రువుల్లా తయారవుతున్నాయి. గుంపులు గుంపులగా వచ్చి చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన తాజా సంఘటన ప్రతి ఒక్కిరిని కలిచి వేసింది. అంబర్ పేటలో చిన్న పిల్లాడిని చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు అందుకు గత ఐదేళ్లలో రూ.18 కోట్లు ఖర్చు పెట్టినట్లు జీహెచ్ఎంసీ లెక్కలు చెబుతోంది. ఇటీవల 'యూత్ ఫర్ యాంటీ కరప్షన్' సంస్థ ఫౌండర్ ఆర్టీఏ కింద దరఖాస్తు చేయగా జీహెచ్ఎంసీ ఈ వివరాలను అందించింది. మరి ఇన్ని కోట్లు ఖర్చుపెట్టినా కుక్కల బెడద పోలేదుగా? అని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల కుక్కల బెడద తీవ్రమైంది. గల్లీలో నుంచి సింగిల్ గా వ్యక్తి వెళ్తే ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి ఉంది. దీంతో కాలనీల్లో మనుషులు వెళ్లాలంటే భయపడుతున్నారు ఇక స్కూల్ కు వెళ్లే చిన్నారులు ఇంటికి రావడానికి వణుకుతున్నారు.అయితే కుక్కల నివారణకు తాము చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా సమస్య మాత్రం తీరడం లేదు. కానీ ఈ సమస్య పరిష్కారం కోసం రూ.18 కోట్లు ఖర్చుపెట్టినట్లు కాగిత లెక్కలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కుక్కల బీభత్సం సృష్టిస్తున్న నేపత్యంలో జీహెచ్ఎంసీ ఎటువంటి పరిష్కారాలు తీసుకుంటుందో 'యూత్ ఫర్ యాంటీ కరప్షన్' సంస్థ ఫౌండర్ పల్నాటి రాజేంద్ర తెలుసుకోవాలనుకున్నాడు. దీంతో ఆయన ఆర్టీఏ కింద దరఖాస్తు చేసి వివరాలు అందించాలని తెలిపారు. దీంతో కూకట్ పల్లి శేరి లింగంపల్లి సికింద్రాబాద్ చార్మినార్ జోన్లలో రూ.18.22 కోట్లు ఖర్చు పెట్టినట్లు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే ఐదేళ్లలో ఒక్క కుక్కను కూడా చంపలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కుక్కల కోసం ఇన్ని కోట్లు కేటాయించాన వాటి సమస్య పరిష్కారం కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వమని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో పలు చోట్ల కుక్కల దాడిలో గాయాలపాలైన ఘటనలు జరగడం విశేషం. మరోవైపు జీహెచ్ఎంసీ మేయర్ కుక్కలకు మాంసం వేయకనే అలా దాడికి దిగుతున్నాయంటున్నారు... ఇప్పటికైనా కుక్కల నివారణకు చర్యలు తీసుకోకపోతే రాను రాను మరెన్ని ప్రాణాలు పోతాయో తెలియడం లేదని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...!!
Previous Post Next Post

نموذج الاتصال