నేడు బడ్జెట్ c ఇది షెడ్యూల్
బడ్జెట్ 2023 : మరి కొన్ని గంటల్లో పార్లమెంట్ బడ్జె్ట్ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. ఇవాళ రెండు సభలనూ ఉద్దేశించి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు..
ఇవాళ, రేపు.. జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండవు. అందువల్ల రాష్ట్రపతి ప్రసంగం తర్వాత... దేశ ఆర్థిక పరిస్థితిని చెప్పే ఆర్థిక సర్వేను రెండు సభల్లో ప్రవేశ పెడతారు. ఈ సర్వే ప్రకారం.. రేపటి బడ్జెట్ ఎలా ఉండబోతోంది అనే దానిపై కొన్ని అంచనాలు వేసుకునే వీలు ఉంటుంది. ఇక రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. సాధారణ బడ్జెట్‌ను ముందుగా లోక్‌సభలో తర్వాత రాజ్యసభలో ప్రవేశ పెడతారు. ఇక గురువారం రెండు సభలూ... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను ప్రారంభిస్తాయి. ఈ చర్చకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రెండు సభల్లోనూ సమాధానాలు ఇస్తారు..
Tags
News@jcl.