BRS శాసనసభా పక్ష సమావేశం - కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారు
స్పీకర్ వైఖరిపై బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో చర్చించాలని కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి 20 రోజులు నిర్వహించేలా బీఏసీ సమావేశంలో పట్టుబట్టాలని గులాబీ నేతలకు కేసీఆర్ సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వందశాతం తాము అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇది సర్వభ్రష్ఠ ప్రభుత్వమని విమర్శించారు.
కాంగ్రెస్ హామీలను చూసి ప్రజలు మోసపోయారని అన్నారు. ప్రజలకు ఎవరెంటో అర్థమైందని చెప్పారు. నదీ జలాల వాటాల విషయంలో అవసరమైతే యుద్ధమేనని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తా
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తానని గులాబీ బాస్ తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలు, సాగు నీటి సమస్యలపై పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్ర తానే చేయాలా లేక కేటీఆర్ చేయడమా అనే అంశంపై చర్చిస్తున్నట్లు చెప్పారు.
కీలక నిర్ణయాలు:
- ప్రజా సమస్యలే అజెండాగా అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని దిశానిర్దేశం
- పాలమూరు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం లక్షమందితో ఆందోళన
- అవసరమైతే తానే ఆందోళనకు నేతృత్వం వహిస్తానని ప్రకటన
- నదీ జలాల వాటా విషయంలోనూ పోరుబాటకు సిద్ధం కావాలని ఆదేశం
- నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలే అజెండాగా ప్రజలతో మమేకం