వానల జోరు మళ్లీ షురూ.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్!

ఇవాళ, రేపు వానలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం!



5 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో దాని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు పేర్కొన్నారు.

పలు జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో వర్షాలు

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈదురుగాలులతో అప్రమత్తం

వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. ముఖ్యంగా వాహనదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంగళవారం కూడా వర్షాల ప్రభావం

మంగళవారం కూడా రాష్ట్రంలోని దాదాపు 22 జిల్లాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే బుధవారం నుంచి వర్షాల తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఎల్లో అలర్ట్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Source: V6 వెలుగు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow