రైలు అంటే గుర్తుకొచ్చేది జర్నీ.. టికెట్ రేటును బట్టి ఫస్ట్, సెకండ్, స్లీపర్ కాస్ లేదా జనరల్.. ఇంత వరకే.. డబ్బున్నోళ్లు ఫస్ట్ క్లాస్ ఏసీలో జర్నీ చేయటం కామన్. ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో కూపేలు ఉంటాయి.. ఎవరితో సంబంధం లేకుండా.. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉండే విధంగా ఉంటాయి.. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఏసీ అనేది హనీమూన్ ఫస్ట్ నైట్ క్యాబిన్ గా మారిపోయింది.. అవును.. ఇది జోక్ కాదు.. ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ ను హనీమూన్ గదిగా డెకరేట్ చేశారు.. ఆన్ లైన్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పూర్తి వివరాల్లోకి వెళితే.. రైలు అంటే గుర్తుకొచ్చేది జర్నీ.. టికెట్ రేటును బట్టి ఫస్ట్, సెకండ్, స్లీపర్ కాస్ లేదా జనరల్.. ఇంత వరకే.. డబ్బున్నోళ్లు ఫస్ట్ క్లాస్ ఏసీలో జర్నీ చేయటం కామన్. ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో కూపేలు ఉంటాయి.. ఎవరితో సంబంధం లేకుండా.. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉండే విధంగా ఉంటాయి.. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఏసీ అనేది హనీమూన్ ఫస్ట్ నైట్ క్యాబిన్ గా మారిపోయింది.. అవును.. ఇది జోక్ కాదు.. ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ ను హనీమూన్ గదిగా డెకరేట్ చేశారు.. ఆన్ లైన్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. హనీమూన్ ఆన్ వీల్స్ అనే పేరు పెట్టారు నెటిజన్లు. ఐడియా అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రైలులో ఈ స్కీం కూడా ఉందా.. హనీమూన్ ప్యాకేజీ ఉందా అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్నారు మరికొందరు నెటిజన్లు. రైలులో హనీమూన్ వినటానికే కొత్తగా ఉంది.. ఈ ఐడియా ఎలా వచ్చిందబ్బా అంటూ మరికొందరు అవాక్కవుతున్నారు. సినిమాల్లో చూసినట్లు ఉందని.. ఇదేదో సినిమా సీన్ అనుకున్నాం అని.. ఇది నిజం అని తెలిస్తే షాక్ అయ్యాం అంటున్నారు మరికొందరు నెటిజన్లు.
రైలులో ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ ను ఈ విధంగా డెకరేట్ చేయటంపై రైల్వే అధికారులు స్పందించారు. ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ అనేది వ్యక్తిగతంగా.. ఏకాంతంగా ఉండటానికి అవకాశం కల్పిస్తుంది. హనీమూన్ గదిగా మార్చుకోవటానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు.. అలాంటి పర్మీషన్ ఏదీ నిబంధనల్లో లేదు. వాళ్ల క్యాబిన్ ను మరింత అందంగా డెకరేట్ చేసుకుంటే కాదని ఎలా చెప్పగలం అంటున్నారు రైల్వే అధికారులు. అయితే భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని.. క్యాండిల్స్ వెలిగించటం అనేది నేరంగా పరిగణిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇది రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుగా చెబుతున్నారు అధికారులు. జల్నా రైల్వేస్టేషన్ లో ఈ వీడియో తీయటం జరిగిందని చెబుతూనే.. ఆ జంట ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది అనేది మాత్రం వెల్లడించలేదు.