రూ.7.11 లక్షల సీసీ రోడ్డుకు శ్రీకారం.. మీనంబరం ఆలయంలో ఐమాక్స్ లైట్స్ ప్రారంభం

 మీనంబరం పరుష వేదీశ్వర స్వామి ఆలయంలో ఐమాక్స్ లైట్స్ ప్రారంభం



మీనంబరం, జూలై 8: మీనంబరం గ్రామంలోని శ్రీ మహా గౌరీ పరుష వేదీశ్వర స్వామి దేవాలయంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు ముచర్ల జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.7.11 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కురువగడ్డపల్లి సర్పంచ్ మనమోని జ్యోతి కరీం, బీజేపీ జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పల్లె తిరుపతి, జడ్చర్ల మాజీ సర్పంచ్ సీతారాం, ఎన్. రాజేశ్, ముచ్చర్ల కృష్ణయ్య, రాపోతుల శ్రీనివాస్ గౌడ్, దేవాలయ కమిటీ సభ్యులు కైలాస్ జోహార్, కొత్తపల్లి యాదయ్య, పుట్ట పర్వతాలు, టీ. భాస్కరాచారి, విష్ణు, కేశవ్, టీ. శ్రీనివాస్, రామచంద్ర రెడ్డి, రాములు, శివాజీ, వెంకటమ్మ, రాజేశ్వరి, తిరుపతమ్మ, కె. వెంకటయ్య, టీ. వెంకటయ్య గౌడ్, బీరయ్య, వార్డు సభ్యుడు మురళి, అర్చకులు బుచ్చప్ప, రంగాచారి, నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ అధ్యక్షుడు బి. గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow