మద్దూర్‌లో డెంగ్యూ అవగాహన ర్యాలీ


 🦟 మద్దూర్‌లో డెంగ్యూ అవగాహన ర్యాలీ.. ప్రజలకు వైద్యుల హెచ్చరిక

 పరిసరాల పరిశుభ్రతతోనే డెంగ్యూ నివారణ.. మద్దూర్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించిన వైద్య సిబ్బంది

నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, ఆశ వర్కర్ల ఆధ్వర్యంలో డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తడి చెత్త–పొడి చెత్త వేరు చేయడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రజలకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ.. దోమల పట్ల నిర్లక్ష్యం చేస్తే డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. పాత వాడేసిన వాహనాల టైర్లు, తాగి పడేసిన కొబ్బరి బొండాలు, మొరుగునీరు ఉండే లోటట్టు ప్రాంతాలు గుంతలు, ఏమైనా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్లు చెప్పినట్లయితే గ్రామపంచాయతీ మరియు మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి వాటిని తొలగించే కార్యక్రమం చేపడతామని అన్నారు కార్యక్రమంలో డాక్టర్లు విజయ్, నరేష్, వెంకటేష్, మౌనికతో పాటు ఆశ వర్కర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow