జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయం పై ఏసీబీ తనిఖీలు


 

JADCHERLA: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం పలు పిర్యాదుల పై ఏసీబి అధికారులు తనిఖీలు చేపట్టారు.

‎వాయిస్ ఓవర్ : ఏసీబి డిస్పి బాలకృష్ణ మాట్లాడుతూ జడ్చెర్ల జడ్చర్ల మున్సిపాలిటీ అధికారుల పై ఇటీవల పలు ఆరోపణలు వస్తుండడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం నుంచి నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా సానిటరీ రెవెన్యూ బర్త్ డెత్ తదితర శాఖలకు సంబంధించిన రికార్డులను పూర్తిగా పరిశీలించడం జరుగుతుందని ఇంకా కొద్ది గంటలు కడిస్తే గాని ఏ విషయాన్ని పూర్తిగా చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. కాగా ఈనెల 6వ తేదీన జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గం గడువు ముగియడంతో ఏడవ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాలకవర్గం ముగింపు సమావేశంలో అవినీతిపై త్వరలోనే తేలుస్తానని చెప్పడంతో ఈ తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow