Volunteer system in Telangana : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థ రానుంది. ప్రతీ గ్రామానికి ముగ్గురు వ్యక్తుల చొప్పున ఉండనున్నాయి. తొలుత కొడంగల్ నియోజకవర్గంలో వీటిని నియమించనున్నారు. ప్రస్తుతం వీరికి శిక్షణ అందిస్తున్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ వ్యవస్థ ఉండనుంది. పూర్తి వివరాలు ఇందులో చూద్దాం.

ఏపీలో అమలైన వాలంటీర్ల వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. గ్రామాల్లోని జనాభా ప్రాతిపదికన వాలంటీర్లను గత ప్రభుత్వం నియమించింది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తొలగించింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఇలాంటి విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను నియమిస్తారు. మొత్తం రాష్ట్రంలో సుమారు 30 వేల మంది వాలంటీర్లను నియమించనున్నారు.

వాలంటీర్లు ఏం చేస్తారు?

ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లు రైతులకు భూసారం ఎలా కాపాడాలి, పంటకు అనుకూలంగా భూమిని ఎలా మార్చుకోవాలి వంటి విషయాల్లో సలహాలు ఇస్తారు. రైతులకు అవగాహన కల్పించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధానాలను సూచిస్తారు.

ముందుగా వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక్రిశాట్ మరియు తెలంగాణ వ్యవసాయశాఖ కలిసి ట్రైనింగ్ అందిస్తోంది. మొదట కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు.

సేంద్రీయ ఎరువుల వినియోగం

భూసార ఆరోగ్య పరిరక్షణను ఉద్యమంలా చేపడతామని తెలిపారు. పంట అవశేషాలను తగలబెట్టకుండా ఎరువులుగా మార్చుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను ఎక్కువగా ఉపయోగించాలని చెప్పారు.

జీలుగు, పిల్లిపెసర, పచ్చిరొట్ట విత్తనాల ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. మే 4 నుంచి 9 వరకు రైతు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow