Jadcherla robbery లిఫ్ట్ ఇచ్చి దోపిడి..! 😱 ముసలామె దగ్గర నగదు లూటీ జడ్చర్లలో షాకింగ్ ఘట

 జడ్చర్లలో షాకింగ్ ఘటన 😳



లిఫ్ట్ ఇస్తానని చెప్పి ముసలామెను బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు…
మధ్య దారిలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి నగదు, వస్తువులు దోచుకొని పరారయ్యాడు.

పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్న లక్ష్మమ్మకు ఈ చేదు అనుభవం ఎదురైంది.
జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.

👉 అపరిచితుల లిఫ్ట్‌లపై నమ్మకం పెట్టుకుంటే ఎంత ప్రమాదమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

💬 ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.
📢 పూర్తి వివరాలు త్వరలోనే JCL News TVలో...


జడ్చర్ల పరిసర ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

కామరం పేటకు చెందిన లక్ష్మమ్మ తన బిడ్డను చూడడానికి కోడిపత్రికి వెళ్లి మూడు నాలుగు రోజులు అక్కడే ఉన్నారు. ఈరోజు పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి తిరుగు ప్రయాణమై డివిటిపల్లికి చేరుకున్నారు.

అక్కడ ఆమెను గమనించిన ఒక యువకుడు “పెద్దమ్మ లిఫ్ట్ ఇస్తా” అంటూ బైక్‌పై తీసుకెళ్లాడు. ఆటోలు రావట్లేదని భావించి లక్ష్మమ్మ కూడా అతని బైక్ ఎక్కారు.

జడ్చర్ల దారిలో సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రాంగణం దగ్గరకు తీసుకెళ్లిన యువకుడు, అక్కడ ఎవరూ లేరని చూసుకుని ఆమె వద్ద ఉన్న నగదు మరియు వస్తువులను దోచుకొని పరారయ్యాడు.

దీంతో బాధితురాలు నేరుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

అపరిచితుల లిఫ్ట్‌లపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow