బేగంపేట్‌లో ప్రమాదం.. గాయపడిన బైక్ రైడర్‌కు ట్రాఫిక్ పోలీసుల తక్షణ సహాయం
హైదరాబాద్: నగరంలో బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు మానవత్వాన్ని చాటుతూ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం చేసి ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం ఉదయం బేగంపేట్ పరిధిలోని బ్రూక్ బాండ్ జంక్షన్ వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇంద్రేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వెంటనే స్పందించారు.
అక్కడే డ్యూటీలో ఉన్న
- కానిస్టేబుల్ టి. సురేశ్
- మొబైల్ ఏఆర్‌పీసీ కె. సురేశ్
- హోమ్ గార్డ్ సయ్యద్ మియా
గాయపడిన వ్యక్తికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించారు. అనంతరం అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు.
ట్రాఫిక్ పోలీసుల ఈ తక్షణ స్పందనతో గాయపడిన వ్యక్తికి సమయానికి వైద్యం అందింది. స్థానికులు ట్రాఫిక్ పోలీసుల మానవత్వాన్ని ప్రశంసించారు
Tags
Hyderabad