తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!

 Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నెలరోజులుగా సాగుతున్న నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రిజల్ట్స్ ఎప్పుడంటే..?

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 10 నుండి 12వ తేదీల మధ్య ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం మార్కుల నమోదు, సాంకేతిక తనిఖీలు, ఫలితాల క్రోడీకరణ తుది దశలో ఉన్నాయి. ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ రెండో వారంలోనే ఫలితాలను ఇచ్చేలా అధికారులు వేగంగా పావులు కదుపుతున్నారు. ఫలితాలను ఎక్కడ చూసుకోవాలి?

విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా కింది అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను పొందవచ్చు.

ఎంత మంది రాశారంటే.?

ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరిగాయి. సుమారు 10,47,815 మంది విద్యార్థులు ఈ సారి ఇంటర్ ఎగ్జామ్స్ రాశారు. అందులో ఫస్టియర్ విద్యార్థులు 4,89,126 మంది కాగా, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow