మానవత్వాన్ని చాటిన ఎస్సై వెంకటేష్ గౌడ్

మానవత్వాన్ని చాటిన ఎస్సై వెంకటేష్ గౌడ్

లింగాల: సలేశ్వరం జాతర సందర్భంగా ఓ హృదయాన్ని హత్తుకునే ఘటన వెలుగు చూసింది.

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన మహేశ్వరి అనే మహిళ అడవి మార్గంలో ప్రయాణిస్తుండగా శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ కాలు విరిగి తీవ్ర ఇబ్బందులకు గురైంది.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే లింగాల ఎస్సై వెంకటేష్ గౌడ్ మానవత్వంతో స్పందించారు. ప్రమాదకరమైన అడవి ప్రాంతమని తెలిసినా వెనుకడుగు వేయకుండా పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని, గాయపడిన మహేశ్వరిని జాగ్రత్తగా మోసుకుంటూ బయటకు తీసుకువచ్చారు.

తర్వాత వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య సేవలు అందేలా చేశారు.

ఎస్సై వెంకటేష్ గౌడ్ చూపిన ఈ సేవాభావం, సమయస్ఫూర్తి అక్కడున్న భక్తులందరినీ కదిలించింది. పోలీసులు కేవలం చట్టం అమలు మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ప్రాణాలను కాపాడే దేవదూతలని మరోసారి నిరూపించిన ఘటనగా ఇది నిలిచింది.

స్థానికులు, భక్తులు ఎస్సై వెంకటేష్ గౌడ్‌ను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow