.. ఇక మరో పరీక్ష కూడా రాయాల్సిందే..
తెలంగాణ: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటున్నారా? అయితే ఇక నుంచి పొందటం మరింత కఠినతరం కానుంది. ఈ మేరకు తెలంగాణ రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే అదనంగా మరో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
రూల్స్‌లో మార్పులు
ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం రెండు టెస్టులు మాత్రమే ఉండేవి. ఒకటి లెర్నర్స్ లైసెన్స్ (LLR), తర్వాత డ్రైవింగ్ టెస్ట్.
అయితే ఇక నుంచి వీటితో పాటు మరో టెస్టు కూడా తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఎల్‌ఎల్ఆర్ పరీక్షకు ముందు ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతపై ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు.
మూడు దశల ప్రక్రియ
ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది:
- ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్ష
- ఎల్‌ఎల్ఆర్ (Learner’s Licence) పరీక్ష
- డ్రైవింగ్ టెస్ట్
ఎల్‌ఎల్ఆర్ పరీక్ష పాసైతే లెర్నర్స్ లైసెన్స్ జారీ చేస్తారు. ఇది ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ లోపు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరై పాసైతే లైసెన్స్ ఇంటికి పంపిస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష వివరాలు
ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షలో మొత్తం ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి మాడ్యూల్ 30 నిమిషాల పాటు ఉంటుంది. మొత్తం పరీక్ష సమయం సుమారు 3 గంటలు.
ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, వీడియో ఆధారిత పాఠాలు వంటి అంశాలు ఇందులో ఉంటాయి. పరీక్ష సమయంలో ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో కెమెరా ఆన్ చేసి రాయాల్సి ఉంటుంది.
అలాగే గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో కూడా ఈ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.
డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఈ కొత్త పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు.