పట్టపగలు ఏంటీ దారుణం..? భార్యను కారులో నుంచి ఈడ్చుకొచ్చి.. కొడవలితో నరికి.. కారుతో తొక్కించి.. What atrocity in broad daylight..? Dragging his wife out of the car.. chopping her with a machete.. and running her over with a car..



కలబురిగి: కర్ణాటకలో పట్టపగలు నడి రోడ్డుపై కొడవలితో భార్య గొంతు కోసి అత్యంత దారుణంగా ఆమెను కారుతో తొక్కించేసి భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనను ప్రత్యక్ష సాక్ష్యులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో గురువారం పట్టపగలు శాన్వీ అనే వివాహితను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఆ వివాహిత వయసు 28 సంవత్సరాలు. మహారాష్ట్రకు చెందిన శాన్వీగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని బారామతికి ప్రాంతానికి చెందిన అక్షయ్, శాన్వీ నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. కర్ణాటకలోని గానుగాపూర్ ఆలయానికి ఎర్టిగా కారులో గురువారం ఉదయం ఇద్దరూ వెళ్లారు. గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని భార్యాభర్త కారులో తిరుగు పయనమయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో కారు బేలూరు గ్రామ సమీపంలో ఉంది. అప్పటికే భార్యాభర్త ఇద్దరూ ఏదో విషయంలో గొడవ పడుతూ వస్తున్నారు. ఆ గొడవ పెరిగి అక్షయ్ రోడ్డు పక్కన కారు ఆపాడు. ఆ కారులో నుంచి తన భార్య శాన్వీని జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చాడు. దీంతో.. శాన్వీ కారులో నుంచి కిందపడింది.

ఈ ఘటనను రోడ్డుపై వెళుతున్న జనం సినిమా చూసినట్లు చూశారు. బాధితురాలు కాపాడమని జనం వైపు చూసి ప్రాధేయపడినా ఏ ఒక్కరూ స్పందించలేదు. వేడుక చూసినట్లు చూస్తూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. అప్పటికే ఆమెపై అక్షయ్ విచక్షణా రహితంగా దాడి చేశాడు. కొడవలితో దాడి చేశాడు.  అయితే అప్పటికి స్పందించిన స్థానికులు అతనిపై రాళ్లేశారు. అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు అక్షయ్ ప్రవర్తించి పొలాల్లోకి వెళ్లి భార్యను రన్నింగ్ కారులో నుంచి కిందకు తోసేశాడు. ఆమెపై నుంచి కారును పోనిచ్చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ భార్య శాన్వీ చనిపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు అక్షయ్ కోసం గాలిస్తున్నారు. భార్యపై వివాహేతర సంబంధం అనుమానంతోనే అక్షయ్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow