Kamada Ekadashi కామద ఏకాదశి(మార్చి 29).. ఇవి దానం చేయండి. పాపాలు పోతాయి.. ఐశ్వర్యం.. సంతానం వృద్ది

 

హిందూ ధర్మంలో ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వచ్చినా ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వేరు. తెలుగు సంవత్సరం తొలి మాసం చైత్రమాసం శుద్ధ ఏకాదశిని కామద ఏకాదశి అంటారు.

ఈ సంవత్సరం మార్చి 29న కామద ఏకాదశి వచ్చింది. ఈ రోజు కొన్ని పరిహారాలు పాటించి విష్ణుమూర్తిని పూజిస్తే పాపాలు తొలగి ఐశ్వర్యం, సంతానం వృద్ధి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మార్చి 29 ఆదివారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కామద ఏకాదశి (2026 మార్చి 29)

విష్ణుమూర్తిని పూజిస్తే ఆయన అనుగ్రహం మెండుగా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కామద ఏకాదశి ఉపవాస వ్రతం బ్రహ్మహత్య వంటి ఘోర పాపాల నుంచి కూడా విముక్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

కామద ఏకాదశి తిథి వివరాలు

  • తిథి ప్రారంభం: మార్చి 28 ఉదయం 08:45
  • తిథి ముగింపు: మార్చి 29 ఉదయం 07:46 వరకు
  • వ్రతం: మార్చి 29న ఉపవాసం పాటించాలి
  • వ్రత విరమణ: మార్చి 30 ఉదయం 6:14 నుంచి 7:09 మధ్య

ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసంతో పాటు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.

ఏమేమి దానం చేయాలి?

  • మట్టి కుండలో నీరు నింపి దానం చేయడం
  • గోధుమలు, బియ్యం, పుచ్చకాయ, మామిడి వంటి ఫలాలు
  • పేదలకు గొడుగు, చెప్పులు లేదా బూట్లు
  • పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు
  • బ్రాహ్మణులకు వస్త్రదానం, దక్షిణ తాంబూలం

కామద ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఆరాధించడం తప్పనిసరి. శమీ మొక్కను పూజించి పిండి దీపం వెలిగించి అందులో కర్పూరం, పసుపు వేయాలి. ఇలా చేస్తే నిలిచిపోయిన ధనం తిరిగి వస్తుందని, గ్రహాల శుభ ప్రభావం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow