గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
పర్వతగిరి (వరంగల్ జిల్లా):
పర్వతగిరి మండలం టూక్యనగర్ ప్రాథమిక పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు పోశాల చంద్రశేఖర్ (46) గుండెపోటుతో మృతి చెందాడు. క్లాస్‌రూమ్‌లో పాఠాలు బోధిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలినట్లు సహచరులు తెలిపారు.
అతడిని వెంటనే నెక్కొండలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన స్వస్థలం సంగం మండలం కాట్రపల్లి గ్రామం.
గతంలో గోరుగుట్ట తండా పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, సహచర ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
🟦 గుండెపోటు లక్షణాలు
- ఛాతీలో బిగుతుగా లేదా ఒత్తిడిగా అనిపించడం
- భుజాలు, చేతులు, మెడ లేదా దవడకు నొప్పి వ్యాపించడం
- చెమటలు పట్టడం, తలనిరుత్తరం
- అలసట లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.