జడ్చర్ల టౌన్: మండుతున్న ఎండలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న వేళ… మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఒక సాధారణ కార్మికుడు తన తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. “జిహ్వకో రుచి… పుర్రెకో బుద్ధి” అన్నట్టుగా, జడ్చర్లకు చెందిన షర్ఫద్దీన్ తన బైక్‌పై చిన్న గుడిసెలాంటి గొడుగును ఏర్పాటు చేసి ఎండను తట్టుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు.
రైస్ మిల్‌లో వర్కర్‌గా పనిచేస్తున్న షర్ఫద్దీన్‌కు ప్రతిరోజూ పనిమీద వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మండుతున్న ఎండల్లో ప్రయాణం చాలా కష్టంగా మారడంతో… బైక్‌పై ఒక ప్రత్యేకమైన గొడుగు ఏర్పాటు చేయాలని ఆలోచించారు.
స్వయంగా వర్కర్ అయిన ఆయన తన ఆలోచనను కార్యరూపం దాల్చిస్తూ కేవలం రూ.3 వేల ఖర్చుతో ఈ ప్రత్యేక గొడుగును తయారు చేసుకున్నారు. ఇందుకోసం ఇనుప పైపులు, నెట్, గోనె సంచులు, వెదురు దెబ్బలు ఉపయోగించి చిన్న గుడిసెలాంటి ఫ్రేమ్‌ను తయారు చేసి బైక్‌కు అమర్చారు.
ఈ గొడుగు కారణంగా మండుటెండలో కూడా సౌకర్యంగా బైక్‌పై ప్రయాణం చేయగలుగుతున్నట్లు షర్ఫద్దీన్ తెలిపారు. ఈ బైక్‌తో ఇప్పటికే కొస్గి, కల్వకుర్తి, నారాయణపేట, అచ్చంపేట వంటి పట్టణాలకు వెళ్లి వచ్చానని చెప్పారు.
అంతేకాకుండా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు గొడుగు పైభాగంలో కొద్దిగా నీళ్లు చల్లుకుంటే మరింత చల్లగా ఉంటుందని తెలిపారు. సాధారణంగా 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా గాలి పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదని ఆయన చెప్పారు.
ఈ ప్రత్యేక బైక్‌ను చూసిన ప్రజలు మాత్రం ఆశ్చర్యపోతూ…
“అదిరిందయ్యా షర్ఫద్దీన్… ఐడియా సూపర్!” అంటూ ప్రశంసిస్తున్నారు.