విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండిళ్లలో దాదాపు కేజీన్నర బంగారం దోచుకెళ్లారు. స్థానిక జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్స్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం అర్ధరాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. చిన్న పిల్లల వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నగేశ్ ఇంట్లో దుండగులు 1,250 గ్రాముల బంగారం, కిలో వెండి దోచుకెళ్లారు. వైద్యుడి కుటుంబం విశాఖలో ఉంటోంది. శనివారం విధులు ముగించుకుని నగేశ్ కూడా విశాఖ వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళం తొలగించి ఉంది. బీరువాలోని వెండి, బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీమ్‌తో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
దీనికి సమీపంలోని మరో నివాస సముదాయంలోనూ చోరీ ఘటన చోటుచేసుకుంది. జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి ఇంట్లో 20 తులాల బంగారు నగలను దుండగులు దోచుకెళ్లారు. ఈ రెండు ఘటనలు జిల్లాలో కలకలం రే
Tags
india