BREAKING NEWS
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ఓటర్ లిస్టులు కలకలం రేపుతున్నాయి.
పలు డివిజన్లలో ఇప్పటికే చనిపోయిన వ్యక్తుల పేర్లకు కూడా పోలింగ్ చిట్టీలు పంపిణీ కావడం సంచలనంగా మారింది.
2020, 2023లో మృతి చెందిన వారి పేర్లు ఇంకా ఓటర్ లిస్టులో ఉండగా, బతికున్న కొందరికి ఓటు హక్కే లేకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆరో డివిజన్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, డివిజన్ల వారీగా ఓట్ల విభజనలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు.
ఇదే సమయంలో 2023లో మృతి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి పేరు, మృతిపత్రం రెండుసార్లు సమర్పించినప్పటికీ డిలీట్ కాలేదని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులు వెంటనే స్పందించాలని మహబూబ్‌నగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Tags
mahabubnagar