అమెరికాతో ట్రేడ్ డీల్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం



 

అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ విజయవంతంగా పూర్తిచేయడంతో.. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం ఈ ట్రేడ్ డీల్ పై క్లారిటీ ఇచ్చింది.

అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ విజయవంతంగా పూర్తిచేయడంతో.. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం ఈ ట్రేడ్ డీల్ పై క్లారిటీ ఇచ్చింది. నిషేధిత దేశాల నుంచి భారత్ ముడిచమురును కొనుగోలు చేయదని స్పష్టం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా వెనిజులాతో సహా ఆంక్షలు లేని దేశాల నుంచి ధరల ఆధారంగా భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉంటుందని కూడా తెలిపింది. వెనిజులాపై ఆంక్షలున్న సమయంలో అక్కడి నుంచి ముడిచమురును కొనుగోలు చేయలేదని గుర్తు చేసింది. ఇప్పుడు ఆ ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో మళ్లీ ముడిచమురు కొనుగోలను ప్రారంభిస్తామని కేంద్రం వెల్లడించింది. ఇంధన కొనుగోళ్లలో ఎప్పటికీ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ నో కాంప్రమైజ్

అలాగే దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని వెల్లడించింది. దేశ వ్యవసాయం, పాడిశ్రమలను కాపాడుకుంటామని, అది తమ బాధ్యత అని కేంద్రం పేర్కొంది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం దేశ రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించదని కేంద్ర ప్రభుత్వ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. భారత్ - అమెరికా ట్రేడ్ డీల్ ద్వార్ ద్వైపాక్షిక వాణిజ్యం భవిష్యత్తులో లక్షంగా పెట్టుకున్న 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. అమెరికాతో భారత్ ఆర్థిక సంబంధాలను ఎప్పుకప్పుడు బలోపేతం చేస్తూనే ఉంటుందని, దేశీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే దీని ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాయి. ట్రేడ్ డీల్ అమలు విధానాన్ని త్వరలోనే పూర్తి వివరాలతో వెల్లడిస్తామని కేంద్రవర్గాలు తెలిపాయి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow