పార్టీ లేదు సిద్ధాంతం లేదు.. బీ-ఫామ్ రాకపోతే బూతులే.. ఆఖరి రోజు రెచ్చిపోయిన నేతలు


 తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో (Telangana Municipal Elections) కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడి కానుంది.నామినేషన్ల విత్ డ్రాకు ఆఖరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా చిత్రి విచిత్రాలు చోటు చేసుకున్నారు. తమకు టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడిన వారు తమ నోటికి పదును చెప్పారు. బీ-ఫామ్‍లు దక్కని వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. పలువురు అభ్యర్థులైతే ఏకంగా బూతులతో పార్టీ పెద్దలపై రెచ్చిపోయారు. ప్రధాన పార్టీలన్నింటిలోనూ ఈ సమస్య కనిపించింది. టికెట్ తమకే కన్ఫ్మ చేస్తామని చివరి వరకు ఆశ పెట్టి భంగపాటుకు గురి చేశారని పలువురు నేతలు కన్నీటి పర్యంతమైన సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

పార్టీ లేదు సిద్ధాంతం లేదు:

రాజకీయాలన్నాక పదవులు ఆశ అందరికి ఉంటుంది. చిన్నదో పెద్దతో పదవి దక్కకపోతుందా? అవకాశం రాకుండా పోతుందా అనే ఆశతోనే చాలా మంది నేతలు పార్టీలో పని చేస్తుంటారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం వస్తుందని భావించిన అనేక మందికి భంగపాటు తప్పలేదు. నేతలకు ఉన్న ప్రజాబలంతో పాటు ఆర్థిక స్థితిగతులను సైతం పరిగణలోకి తీసుకుని పార్టీలు బీఫామ్స్ కేటాయించారు. ఎన్నికల్లో కర్చుపెట్టే స్థోమత ఉన్నవారికే అవకాశం ఇవ్వగా కొన్నిచోట్ల పార్టీ మారి వచ్చిన వారికి అవకాశం కల్పించారు. దీంతో చాలా కాలంగా పార్టీలో కొనసాగుతున్న నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ఇన్నాళ్లు ఎన్ని అవమానాలు ఎదురైనా విడవకుండా మోసిన పార్టీ జెండా, పార్టీ సిద్ధాంతాలు వారి ఆక్రోశాన్ని ఆపలేకపోయాయి. కట్టలు తెంచిన ఆగ్రహంతో పార్టీ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు. కొన్ని చోట్ల బూతులతో రెచ్చిపోయారు.

దుమ్మెత్తి పోసిన మహిళా నేత:

పలు చోట్ల మహిళా నేతలు కంటతడి పెట్టగా సంగారెడ్డి జిన్నారం మున్సిపాలిటీలో తనకు రావాల్సిన టికెట్ అమ్ముకున్నారని ఓ మహిళా నేత దుమ్మెత్తి పోయగా, జగిత్యాలలో తనకు వచ్చిన బీఫామ్ చింపేశారని మహిళా నేత నేత కంటతడి పెట్టారు. జగిత్యాలలో తనకు టికెట్ ఇవ్వలేదని సిట్టింగ్ కౌన్సిలర్ కంటతడి పెట్టగా ఒర్జినల్ బీజేపీ వారిని కాదని పార్టీ మారి వచ్చిన వారికి ఎలా టికెట్ ఇస్తారని మరో నేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఫామ్ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటి ముందు బీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులు కళ్ళేపెల్లి మహేష్ దంపతులు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ బీ ఫామ్ దక్కని నేతలు కంటతడి, తిట్ల పురాణం, ఆత్మహత్యాయత్నంతో పొలిటికల్ సీన్ అంతా ఎమోషన్ గా మారిపోయింది.

కలిసివచ్చేనా?:

అవకాశం దక్కని నేతల ఆవేదన ఇలా ఉంటే ఎలాగోల బీ ఫామ్స్ సాధించుకున్న నేతలకు మరో టెన్షన్ వెంటాడుతోంది. పార్టీలో అవశం దక్కని నేతలు ఏమేరకు తమకు సహకరిస్తారనే టెన్షన్ అభ్యర్థులను వెంటాడుతోంది. ఎలాగైనా అసంతృప్తులు తమకు సహకరించేలా బుజ్జగింపుల పర్వం మొదలైంది. దీంతో అభ్యర్థులలో మున్సిపల్ ఎన్నికలు ఎవరికి కలిసి రాబోతున్నాయి? మరెవరికి బెడిసి కొట్టబోతున్నాయి అనేది ఈ నెల 11 వ తేదీన తేలనుంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow